గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన పిటీషన్ల పరిష్కారంలో సంతృప్తి స్థాయి తక్కువగా ఉన్న శాఖల అధికారులతో బుధవారం మధ్యాహ్నం సమీక్షించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ , సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ, డిఆర్ఓ ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్ గంగరాజు ,ఆర్ డి ఓ శ్రీనివాస రావు ప్రజల నుండి 172 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన అనంతరం అధికారులతో జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన పిటీషన్లను గడువులోపు పరిష్కరించాలన్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నాణ్యతగా పరిష్కరించాలన్నారు. పిటిషన్ దారుల దరఖాస్తులను గుణాత్మకంగా పరిశీలించి వారి సంతృప్తి స్థాయిని పెంచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. పీటీషన్ల పరిష్కారంలో సంతృప్తి స్థాయి తక్కువగా ఉన్న శాఖ అధికారులతో బుధవారం మధ్యాహ్నం సమీక్షించడం జరుగుతుందన్నారు. వారు పరిష్కరించిన పిటీషన్లు గుణాత్మకంగా , సహేతుకంగా ఉందా , లేదా అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందన్నారు. బియాండ్ ఎస్ ఎల్ ఏ లో వున్న పిటీషన్లు ముందుగా పరిష్కరించాలన్నారు. శాఖల వారీగా పెండింగ్ దరఖాస్తులను జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ సమీక్షించి సూచనలు చేసారు. ఫిర్యాదుల పరిష్కారాన్ని నిర్ణీత గడువు లోపు ఎట్టి పరిస్తితుల్లోను పరిష్కరించాల్సి వుందన్నారు. కోర్టు కేసులకు సంబంధించి సమీక్షిస్తూ గౌరవ కోర్టులకు ఎప్పటికప్పుడు కౌంటర్లు దాఖలు పరచాలన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా కేసు కంటెమ్ట్ వరకు వెళ్ళకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ఈ నెల 16 వ తేది నుండి ఫిబ్రవరి 15 వరకు జరుగుతున్నాయని , ఇందుకు సంబంధించి జిల్లా అధికారులు వారి సిబ్బందికి అవగాహన కల్పించడంతో పాటు ద్విచక్ర వాహనాలు నడిపే సిబ్బంది తప్పని సరిగా హెల్మెట్ ధారణ చేసే విధంగా చూడాలన్నారు. అలాగే శాఖలో ఉన్న సిబ్బందికి సర్క్యులర్ జారీ చేయాలన్నారు. ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారులు కరపత్రాలను అధికారులకు పంపిణీ చేశారు.
ఈ సమావేశంలో సిపిఓ శేషశ్రీ , డియం అండ్ హెచ్ఓ డా. విజయలక్ష్మీ , డిఎస్ఓ కోమలి పద్మ , డిపిఓ బి.వి.నాగ సాయి కుమార్ , డిసిఓ వీరాచారి , డీడీ సోషల్ వెల్ఫేర్ మధుసూధన రావు , జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు , ఎల్ డి యం మహిపాల్ రెడ్డి , ఆరోగ్య శ్రీ జిల్లా కో ఆర్డినేటర్ విజయ్ ప్రకాశ్ , తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News