-జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ స్కేటింగ్ పోటీల్లో సత్తా చాటి ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అందుకున్న మాత్రపు జెస్సీరాజ్ గుంటూరు జిల్లాకు గర్వకారమని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ అన్నారు. రాష్ట్రీయ బాల పురస్కార్ గ్రహీత జెస్సీరాజ్‌ను కలెక్టర్ నాగలక్ష్మీ కలెక్టర్‌లోని ఆమె ఛాంబర్‌లో సోమవారం అభినందించారు. చిన్నవసులోనే ప్రపంచ స్థాయి పతకం సాధించి భారత జాతి కీర్తిని జెస్సీ ప్రపంచానికి చాటిందన్నారు. ఇటీవల ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అందుకుని యావత్తు దేశ ప్రజల దృష్టిని మన గుంటూరు వైపు మళ్లించిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని ప్రపంచ పతకాలు సాధించి గుంటూరు ఖ్యాతిని చాటాలని జెస్సీరాజ్‌కు కలెక్టర్ నాగలక్ష్మీ సూచించారు. గుంటూరు జిల్లా డీఎస్‌డీవో నరసింహారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.