తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి నెల నిర్వహించే తనిఖీ లో భాగంగా రేణిగుంట వద్ద గల ఈవీమ్స్ మరియు వివిప్యాట్ లను భధ్రపరిచే గోడౌన్‌లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్. తనిఖీ లో భాగంగా షట్టర్లకు వేసిన సీళ్లను, సిసి కెమెరాలను పరిశీలించి భద్రత సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జి ఎన్ ఎస్ ఎస్ డిప్యూటీ కలెక్టర్, నోడల్ అధికారి సుధారాణి, ఎన్నికల సూపరింటిండెంట్ ప్రసాద్, రేణిగుంట తాసిల్దార్ సురేష్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
