-రోటరీ కృషి వలన ప్రపంచ వ్యాప్తంగా పోలియో కేసుల సంఖ్య 99 శాతం తగ్గాయి
-రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన జ్ఞాన క్రియ సమ్మేళనం 41వ జిల్లా సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రోటరీ క్లబ్ కృషి వలన ప్రపంచ వ్యాప్తంగా పోలియో కేసుల సంఖ్య 99 శాతం తగ్గాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. బుధవారం ఉదయం స్థానిక శిల్పారామం నందు రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో 29,30 తేదీలలో నిర్వహిస్తున్న జ్ఞాన క్రియ సమ్మేళనం 41వ జిల్లా సమావేశంలో మొదటి రోజు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రోటరీ క్లబ్ కు సంబందించిన ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్ర సభ్యులందరికీ శుబాకాంక్షలు తెలిపారు. రోటరీ క్లబ్ కృషి వలన దేశ మరియు ప్రపంచ వ్యాప్తంగా 99 శాతం పోలియో కేసులు తగ్గాయని, వారు చేసిన సేవలు ఎనలేనివని తెలిపారు. ఈ రోజు తిరుపతి నందు కలియుగ వెంకటేశ్వర స్వామి కొలువున్న ప్రదేశంలో ఈ సమావేశం నిర్వహించడం శుభపరినామమని తెలిపారు. మన రాయలసీమ, కడప జిల్లా, ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తి రోటరీ జిల్లా గవర్నర్ గా ఎన్నికైన సాదు గోపాల కృష్ణ గారికి శుబాకాంక్షలు తెలిపారు. ఈ రోటరీ ద్వారా దేశ, ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు స్వచ్చందంగా నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారని, ప్రతి ఒక్కరిలో మంచి చెడు అనే గుణాలు ఉంటాయని అవి మంచికి వాడాలని తెలిపారు. అలాగే మనం దేశం మొదట, పార్టీ తరువాత, నేను చివర అనే సిద్దంతంతో ముందుకెళ్లాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరు వారి స్వార్థం కోసం కాకుండా దేశం కోసం ఆలోచించాలని అప్పుడే దేశం బాగుంటుందని, ప్రతి ఒక్కరు సేవా కార్యక్రమాలు చేయుటకు ముందుకు రావాలని తెలిపారు. పలు స్వచ్చంద సంస్థలు ఇలా సేవా కార్య్రక్రమాలు చేయుటకు ముందుకు వస్తున్నారని, వారు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని, అలా చేయడం వలన గుర్తింపు వస్తుందని ఈ సందర్బంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కు సంబందించిన ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్ర సభ్యులు పాల్గొన్నారు.