విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా భారీ రక్తదాన శిబిరం సత్యనారాయణపురంలో జరిగింది. గురువారం సత్యనారాయణపురం, శివాలయంవీధిలో వేద హాస్పిటల్‌లో టిఎన్‌ఎస్‌ఎఫ్ సెంట్రల్ అధ్యక్షుడు మనోజ్‌కుమార్, అనిల్‌కుమార్, రవికుమార్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తనయుడు బొండా రవితేజ ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు. వేద హాస్పిటల్ సీఈవో వై.శేష సాయి, శ్రీ వేద చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ వై.శిరీష రాణి, తదితరులు పాల్గొని నిర్వహించిన ఈ శిబిరానికి భారీ సంఖ్యలో విద్యార్దులు విచ్చేశారు. ఉత్సాహంగా పాల్గొని రక్తదాతలకు సర్టిఫికెట్‌ను అందజేశారు. అనంతరం భారీ కేక్‌ను కట్‌చేసి పంపిణీ చేసి దానితోపాటు పేదలకు వృద్ధులకు పళ్ళు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
