గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ స్థాయి సంఘ (స్టాండింగ్ కమిటీ) ఫిబ్రవరి 3వ తేదీన జరగనున్నఎన్నికల్లో 12 మంది అభ్యర్ధులు తుది పోటీలో ఉన్నారని, నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజైన గురువారం ముగ్గురు కార్పొరేటర్లు తమ నామినేషన్లను ఉపసంహరణ చేసుకున్నారని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్, స్టాండింగ్ కమిటి ఎన్నికల అధికారి చల్లా ఓబులేసు తెలిపారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు 17 మంది కార్పొరేటర్లు నామినేషన్లు దాఖలు చేశారన్నారు. వారిలో పఠాన్ రిహాన (57), తేలుకుట్ల హనుమాయమ్మ (19)లు బుధవారం తమ నామినేషన్లను ఉపసంహరణ చేసుకున్నారని, గురువారం పోతురాజు సమత(6), అచ్చాల వెంకటరెడ్డి (30), షేక్ రోషన్ (29)లు తమ నామినేషన్లను ఉప సంహరణ చేసుకున్నారన్నారు. ఉపసంహరణల అనంతరం తుది పోటీల్లో అడకా పద్మావతి, అంజలి మర్రి, ఈరంటి వర ప్రసాద్, కొమ్మినేని కోటేశ్వరరావు, గోపి శ్రీనివాస్, దాసరి లక్ష్మీదుర్గ, దూపాటి వంశీబాబు, నూకవరపు బాలాజీ, ముప్పవరపు భారతి, యాట్ల రవి కుమార్, రాజలత బూసి, షేక్ మీరావలి లు 12 మంది కార్పొరేటర్లు ఉన్నారన్నారు. ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నికలు జరుగుతాయని, అనంతరం ఓట్ల లెక్కింపు కూడా అదే రోజు జరుగుతుందని తెలిపారు.
