Breaking News

పెన్షన్లు పంపిణీ ప్రక్రియ త్వరగా పూర్తి చేయండి

-నిత్యం త్రాగునీటి పరీక్ష నిర్వహిస్తుండండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోగల పెన్షన్ల పంపిణీలను సత్వరమే పూర్తి చేయాలన్నారు కమిషనర్ ధ్యానచంద్ర. శనివారం ఉదయం 18వ డివిజన్ వాటర్ ట్యాంక్ రోడ్, రాణి గారి తోట ప్రాంతాల్లో పర్యటించి పెన్షన్ లబ్ధిదారులకు స్వయంగా తామే ఆధార్ కార్డు , రియల్ టైం బెనిఫిషరీ ఐడెంటిఫికేషన్ సిస్టం యాప్ లో పరిశీలించి పెన్షన్ నగదు అందజేశారు. వారితో మాట్లాడి ప్రతి నెల సరైన సమయానికి పెన్షన్ అందుతుందా లేదా, ఎంత పెన్షన్ అందుతుంది వంటి విషయాలపై అర తీశారు.

తదుపరి ఇంజనీరింగ్ సిబ్బంది వారు చేస్తున్న త్రాగునీటి పరీక్షను పరిశీలించారు, అందులో ఉన్న క్లోరిన్ శాతంని పరిశీలించి, ప్రతిరోజు జరుగుతున్న త్రాగునీటి పరీక్షను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రజలకు నిత్యం పరిశుభ్రమైన త్రాగునీరుని అందజేసేలా చూసుకోవాలన్నారు. అధికారుల పర్యటనలో ఎప్పటికప్పుడు డ్రైన్ క్రాసింగ్ ని పరిశీలిస్తూ ఉండాలన్నారు. తదుపరి రాణి గారి తోటలోని అన్న క్యాంటీన్ ను పరిశీలించి, కిచెన్ శుభ్రత ఆహార నాణ్యత మరుగుదొడ్ల నిర్వహణ ఎప్పటికప్పుడు చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ జీవి జీ ఎస్ వి ప్రసాద్, ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, జాయింట్ డైరెక్టర్ అమృత్ డాక్టర్ లత, సూపరిండెంటింగ్ ఇంజనీర్ (వర్క్స్) పి. సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *