Breaking News

మేరీమాత ఉత్సవాల ఏర్పాట్లలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఫిబ్రవరి 9, 10, 11వ తేదీల్లో జరిగే గుణదల మేరీ మాత ఉత్సవాలలో విజయవాడ నగరపాలక సంస్థ వారు చేసే ఏర్పాట్లలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు. శనివారం ఉదయం తన పర్యటనలో భాగంగా బెత్లెహేమ్ నగర్, ఏలూరు రోడ్ ప్రాంతాలు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని, త్రాగునీరు, పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలని. ఉత్సవాలకు వచ్చే మేరీ మత భక్తులకు విజయవాడ నగరపాలక సంస్థ వారు కల్పించే త్రాగునీటి సరఫరా లో ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని, అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ నిత్యం పారిశుధ్య నిర్వహణ పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ జీవి జీ ఎస్ వి ప్రసాద్, ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరిండెంటింగ్ ఇంజనీర్ వర్క్స్ పి సత్యనారాయణ, జోనల్ కమిషనర్ ప్రభుదాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, ఇంచార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెహికల్ డిపో యేసు పాదం, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *