గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పెన్షన్ల పంపిణీ విధుల్లో నిర్లక్ష్య వైఖరి కనబరిచిన 8 మంది వార్డ్ సచివాలయ కార్యదర్శులకు గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశాల మేరకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో వార్డ్ సచివాలయ కార్యదర్శుల ద్వారా జరుగుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ను శనివారం ఉదయం 6 గంటల నుండే ఫించనుదారులకు పంపిణి కార్యక్రమము ప్రారంభించవలసినదిగా ఫించన్ పంపిణీ అధికారులైన వార్డ్ సచివాలయ కార్యదర్శులకు పలుమార్లు వాట్స్ప్ మేస్సేజ్స్ ద్వారా, నోడల్ అధికారుల ద్వారా ఆదేశించడమైనది. అయినప్పటికీ డి.స్వాతి (18) రెవెన్యూ సెక్రటరీ, వై.ఫణి కిషోర్ (27) శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, ఎ.శ్రీనివాసరావు (115) అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, కె.మధుకిరణ్ (159) ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వి.సెబాస్టియన్ (184) రెవెన్యూ సెక్రటరీ, కె.స్వాతి (187) ఉమెన్ & వీకర్ సెక్షన్ ప్రొటెక్షన్ సెక్రటరీ, కె.రమణ అప్పల నాయుడు (187) ఏమినిటిస్ సెక్రటరీ, వి.ఉషా రాణి (205) వార్డ్ హెల్త్ సెక్రటరీలు ఉదయం 9 గంటల వరకు లాగిన్ అవ్వకపోవడం, పించన్ పంపిణీ ప్రారంభించక పోవడంపై షోకాజ్ నోటీసులు జారీ చేసి, వివరణ కోరామన్నారు.
Prajavartha Online Telugu News