Breaking News

గ్యాస్ ఏజెన్సీ డీలర్ల సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పేద కుటుంబాలకు సంవత్సరానికి మూడు (3) గ్యాస్ సిలిండర్ లు ఉచితంగా పంపిణి చేయడము జరుగుతున్నదని, ఈ విషయంలో ఏజెన్సీ , వారి ప్రతినిధులు అనధికార వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలు నేపథ్యంలో అటువంటి ఘటనలను ఉపేక్షించడం జరగదని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు స్పష్టం చేశారు.

గురువారం సాయంత్రం డి ఎస్ వో కార్యాలయంలో గ్యాస్ ఏజెన్సీ డీలర్ల సమావేశంలో ముఖ్య అతిథిగా జెసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జేసి చిన్న రాముడు మాట్లాడుతూ, జిల్లా లో ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పొందుతున్న లబ్దిదార్లుకు సిలిండర్లకు తాము చెల్లించిన నగదు 24-48 గంటల లోపు పనిదినాలలో తమ ఖాతాల్లో జమ అవుతున్నాయని లబ్దిదారులు వ్యక్తం చెయ్యడము జరుగుతున్నదన్నారు. అదే విధముగా లబ్దిదారులు దీపం -2 ఉచిత గ్యాస్ పదకం క్రింద చెల్లించవలసిన అసలు బిల్లుకు అదనంగా కొన్ని గ్యాస ఏజన్సీల డెలివరీ బాయ్ లు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యములో సదరు గ్యాస్ ఏజన్సీ సేల్స్ అధికారులతో సమావేశం నిర్వహించి లబ్దిదారుల నుంచి అధిక మొత్తం లో నగదు వసూలు చెయ్యవద్దని ప్రతి నెల రెండు సార్లు గ్యాస్ డెలివరీ బాయ్ లుకు మీటింగ్ నిర్వహించవలసినదిగా మరియు రిపిటేడ్ గా తప్పు చేసే ఏజెన్సీలు పై తగు చర్య తీసుకోనబడునని హెచ్చరించడమైనది.

కావున ఈ పధకం క్రింద ఏ ఒక్కరు అదనంగా డబ్బు చెల్లించవలసిన అవసరం లేదని ఆ విధముగా కాకుండా లబ్దిదారులు నుండి గ్యాస్ ఏజన్సీలు / డెలివరీ బాయిలు గాని అదనంగా డబ్బులు వసూలు చేసినచో జిల్లా పౌరసరఫరాల అధికారి, తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం వారి మొబైల్ నెంబర్ 8008301429 నకు ఫిర్యాదు చెయ్య వచ్చునని తెలిపారు.

అర్హత కలిగిన పేద ప్రజలకు ఉద్దేశించిన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం లబ్దిదారులు సక్రమంగా వినియోగించుకొని ఎటువంటి అవకతవకలకు గాని, బ్లాక్ మార్కెట్ లో అమ్ముటకు గాని ఏజన్సీలు పాల్పడరాదని ఇందుమూలముగా తెలియజేయడమైనది.

ఈ సమావేశంలో ఇంచార్జీ జిల్లా పౌర సరఫరాల అధికారి ఎం. నాగంజనేయులు, డిటి సురేష్, గ్యాస్ ఏజెన్సీ డీలర్ల అసోసియేషన్ కు చెందిన అప్పాజీ, రామారావు తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *