Breaking News

ఏం ఎస్ ఎమ్ ఈ సర్వే కి సహకారం అందచేయాలి

-పేదరిక నిర్మూలన దిశగా పి-4 సర్వే చెయ్యాలి
-జిల్లా కలెక్టర్ ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పేదరిక నిర్మూలన, విజన్ 2047 అంశాల నేపథ్యంలో మార్గదర్శకాలు అనుసరించి సర్వే నిర్వహించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు.

గురువారం సాయంత్రం విజయవాడ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పీ 4 సర్వే ప్రక్రియ, మార్గదర్శకాలు, కలెక్టర్ల ఆధ్వర్యంలో చేపట్టవలసిన చర్యలపై దిశా నిర్దేశం చెయ్యడం జరిగింది.

స్థానిక కలెక్టరేట్ దృశ్య మాధ్యమం సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, మునిసిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పీ ప్రశాంతి మాట్లాడుతూ, పీ 4 కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో, ప్రతి ఇంటికీ అభివృద్ధి, ప్రతి జీవితానికి ప్రగతి, స్వర్ణాంధ్ర @ 2047 దిశగా, సమాజం లో వున్న 20% గుర్తించి వారి మెరుగైన స్థితిని కల్పించే దిశగా ఫెబ్రవరి 7 నుంచి సర్వే నిర్వహించవలసి ఉందనారు. అత్యంత నిరుపేదల అభ్యునతికి P4 మోడల్-పీపుల్, ప్రైవేట్, పబ్లిక్ పార్టనర్షిప్ ద్వారా టాప్ 10% తెలుగు ప్రవాసులు మరియు అధిక సంపన్నవ్యక్తుల (HNI) సహకారంతో పేదరికం లేని సమాజాన్ని సాధించడానికి కృషి ఈ సర్వే ముఖ్య ఉద్దేశం అన్నారు.

ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త- ప్రతి ఇంటిని వృద్ధి కేంద్రంగా మార్చడం కుటుంబ సాధికారతలో భాగస్వాములుగా కుటుంబాలకు సంపద సృష్టించడం (ప్రభుత్వ ప్రజల ప్రైవేట్ భాగస్వామ్యం) ముఖ్య ఉద్దేశం అన్నారు. జిల్లాలో ఎం ఎస్ ఎం ఈ సర్వే విద్యుత్తు కనెక్షన్స్ ఆధారంగా చేపట్టడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. జిల్లాలో ఎం ఎస్ ఎం ఈ యూనిట్స్ కి సంబంధించి 92,960 విద్యుత్తు కనెక్షన్స్ ఉన్నాయని, వాటిలో ఇప్పటి వరకు 28,229 యూనిట్లు సర్వే చేశామని తెలిపారు. మిగిలిన సర్వే సజావుగా పూర్తి చేసేందుకు జిల్లా ప్రజలు, వినియోగదారులు సహకరించాలని కలెక్టర్ పి ప్రశాంతి విజ్ఞప్తి చేశారు.

 

ఏ కుటుంబం కూడ వెనుకపడకుండ సమ్మలిత వృద్ధిని ప్రోత్సహించడం
ప్రధమ 10% అధిక సంపన్నులు వెనుకబడిన 20% ప్రజలకు తోడ్పాటు అందజేయడం పి 4 సర్వే ముఖ్య ఉద్దేశం అన్నారు. విక్షిత్ భారత్‌కు అనుగుణంగా, స్వర్ణ ఆంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ 10-సూత్రాల మార్గదర్శకాల ప్రకారం
సున్నా పేదరికం , నైపుణ్యం & ఉపాధి ,
జనాభా నిర్వహణ & మానవ వనరుల అభివృద్ధి , నీటి భద్రత , రైతు-అగ్రి టెక్ , గ్లోబల్-బెస్ట్ లాజిస్టిక్స్ , ఖర్చు ఆప్టిమైజేషన్ – శక్తి & ఇంధనం , ఉత్పత్తి పరిపూర్ణత , స్వచ్ఛ ఆంధ్ర , డీప్ టెక్ వంటి అనేక అంశాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో పేదరిక నిర్మూలన కోసం జీరో పావర్టీ సూత్రంలో భాగంగా జీరో పావర్టీ పీ4 పాలసీని ప్రారంభించడం జరిగింది.

జిల్లా స్థాయి కార్యకలాపాలు , కార్యాచరణ, సమన్వయ శాఖల భాగస్వామ్యం తో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు అనుసరించి సర్వే నిర్వహించాలన్నారు. సర్వే ను ఫిబ్రవరి 7 నుండి 22 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రామ సభల నిర్వహణ, ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు , కార్యశాల నిర్వహణ చేపట్టాలని సూచించారు. ఇందుకు సంబంధించి ఎన్యూమారేటర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో మునిసిపల్ కమిషనర్ చేతన్ గార్గ్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఎల్ . అప్పలకొండ, డీపీఆర్వో ఐ కాశయ్య, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీవణిధర్ రామన్, సహాయ సంచాలకులు పి . ప్రదీప్ కుమార్, డిఆర్డి ఏ పీడీ ఎన్వీవీఎస్ మూర్తి, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి . శాంతమణి, డిఎల్ డివో పి వీణా దేవి, జిల్లా పాఠశాల విద్యా అధికారి కే వాసు దేవరావు, డివిజనల్ పీఆర్వో ఎం.లక్ష్మణాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *