-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యర్ధాల సేకరణలో ఎటువంటి జాప్యం ఉండరాదని, వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా శిఖామణి సెంటర్, బడవపేట, వుడ్ పేట, గుణదల ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతిరోజు వ్యర్ధాలను కచ్చితంగా సేకరించాలని, రోడ్డుపైన ఉన్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు ట్రాక్టర్లలో గార్బజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లకు తరలించాలని, పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండకూడదని అధికారులను ఆదేశించారు.
నగరంలో ఉన్న అన్ని మరుగుదొడ్లను మరమ్మతులు చేయించాలని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని, మరుగుదొడ్లలో నీటి సరఫరా, బకెట్లు తదితర సౌకర్యాల కల్పనలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని వాటర్ ట్యాంక్ వద్ద నమ్మ టాయిలెట్లను పరిశీలించి అధికారులను ఆదేశించారు.
అంగరంగ వైభవంగా జరుగుతున్న గుణదల మేరీమాత ఉత్సవాలలో విజయవాడ నగరపాలక సంస్థ వారు కల్పిస్తున్న సౌకర్యాలలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని నిరంతరం పారిశుధ్య నిర్వహణ, అధికారుల పర్యవేక్షణలో జరగాలని త్రాగునీటి సరఫరాలో భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో చీఫ్ సిటీ ప్లానర్ జీవి జీఎస్ వి ప్రసాద్, ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెంటింగ్ ఇంజనీర్ (ప్రాజెక్ట్స్) పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు జి సామ్రాజ్యం, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News