-జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్శన్ గద్దె అనురాధ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 27న జరిగే పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వారి మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేరు ముందు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ గద్దె అనురాధ కోరారు. శుక్రవారం ఉదయం పటమట లోని త్రివేణి కాలేజీలో మరియు భారతి నగర్ వెస్టిన్ కాలేజీలలోనీ పట్టభద్రులైన అధ్యాపకులను గద్దె అనురాధ కలిసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలాగే ఆ కళాశాలలోని విద్యార్థులను కలిసి వారి తల్లిదండ్రుల్లో పట్టభద్రులైన ఓటర్లు ఉంటే వారిని కూడా ఆలపాటిరాజేంద్ర ప్రసాద్ కు ఓటు వేయాలని తెలియజేయమని చెప్పారు.
ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ అభివృద్ధికి ఆచూకీ నారా చంద్రబాబు నాయుడు అని కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి దానికి నిదర్శనం అన్నారు. ఇటీవల జరిగిన దావూస్ పర్యటనలో చైనా తరువాత తమ తెలంగాణలోని హైదరాబాద్ నగరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారని, కానీ హైదరాబాద్ ను అంతలా రూపుదిద్దున దార్శినికుడు చంద్రబాబు నాయుడు అన్నారు. అంతాలా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెంది మిగిలిన రాష్ట్రల కంటే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో, పారిశ్రామిక రంగంలో ముందుకు రావాలంటే శాసన మండలిలో కూడా కూటమి ప్రభుత్వ బలంగా ఉండేందుకు రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించి కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో పేరేపి ఈశ్వర్, నర్రా కిషోర్, వీరంకి డాంగే కుమారి, గరికపాటి శ్రీనివాస్ (బద్రి), కర్నా రమేష్, నాసర్ వలీ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News