Breaking News

స్కూల్ ఫీజులు నిమిత్తం గద్దె క్రాంతి ఆర్థిక సహాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
8వ డివిజన్ ఇజ్రాయిల్ పేటకు చెందిన పచ్చగళ్ల యోనారాజు చనిపోవడంతో ఆయన భార్య పచ్చిగళ్ళ చిన్నారి తన ఇద్దరు కుమార్తెల చదువుకు ఇబ్బంది నేపథ్యంలో శుక్రవారం ఉదయం గద్దె క్రాంతి కుమార్ ఇజ్రాయెల్ పేటలోని వారి ఇంటికి వెళ్లి 25 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్బంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ తండ్రి చనిపోవడంతో పచ్చిగళ్ళ సంజన, సాక్షి ఇద్దరు ఆడపిల్లలు చదువులు మధ్యలో ఆగిపోకుండా ఉండేందుకు తాను ఈ ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందన్నారు.

బడ్డికొట్టులో సరుకులు నిమిత్తం 3 వేలు ఆర్థిక సహాయం
ఇజ్రాయిల్ పేటకు చెందిన కర్ర ఎస్తేరమ్మ ఉపాధి నిమిత్తం బడ్డీ కొట్టు నడుపుకునేందుకు సరుకులు కొనుగోలు నిమిత్తం గద్దె క్రాంతి కుమార్ రూ. 3 వేలు ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ కార్యక్రమంలో మల్లెల రామకృష్ణ, బద్దూరి వీరారెడ్డి, మెరకనపల్లి నాగేశ్వరరావు, రెడిపొంగు జైహిందరావు, బొప్పూరి భవాని, కర్రా సురేష్, బొప్పూరి యోహాన్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *