విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ గాంధీనగర్ లో ఒక హోటల్ జరిగినది, ఈ కార్యక్రమంలో అఖిల భారత మాల సంఘాల జే. ఏ. సీ కార్యవర్గ ఎన్నిక మరియు నియామక పత్రాలు జారీ చేయడం జరిగినది, అఖిల భారత మాల సంఘాల జే. ఏ. సీ చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ (ఐ.ఆర్.ఎస్ రిటైర్డ్ ) అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎస్. సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అని , దళితుల హక్కుల అణచివేతను ఎదుర్కునేందుకు కార్యాచరణ రూపొందించడం జరిగిందని, మాలల హక్కులను కాపాడుకోనేందుకు అఖిల భారత మాల సంఘాల జే. ఏ.సీ కృషి చేస్తుంది అని తెలిపారు SC వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అని, న్యాయ విరుద్ధం అని, సామాజిక విరుద్ధం అని ఇప్పటికే న్యాయ పోరాటం మొదలు పెట్టామని, డిసెంబర్ 15 న గుంటూరు జిల్లా నల్లపాడు లో మాలల మహా గర్జన కార్యక్రమానికి లక్షలాది మాలలు హాజరై SC వర్గీకరణ ను వ్యతిరేకించినా, రాష్ట్ర ప్రభుత్వం SC వర్గీకరణ ప్రయత్నాన్ని మానుకోవాలి, లేనిచో మాలలు క్షేత్ర స్థాయిలో ఉధ్యమించుడానికి అఖిల భారత మాల సంఘాల జే. ఏ. సీ ఉద్యమిస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమం లో జే. ఏ. సి వైస్ చైర్మన్ గుర్రం రామారావు, మహిళా అధ్యక్షురాలు నాగ మల్లేశ్వరి ఇలా, రాష్ట్ర నాయకులు, జిల్లాల నుండి నాయకులు పాల్గొన్నారు.
