రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ దేవాలయాల కార్యక్రమంలో పాల్గొనుటకు సోమవారం మధ్యాహ్నం 3.53 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కి సాదర స్వాగతం లభించింది.
రెవెన్యూ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్, టిటిడి ఈ ఓ శ్యామలరావు, అడిషనల్ ఈ ఓ వెంకయ్య చౌదరి, డీఐజీషిమోషిబాజ్పాయ్, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాద్ రావు, జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, సత్యవేడు, వెంకటగిరి, నగరి, పూతలపట్టు, గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యేలు పులివర్తి వెంకట ముని ప్రసాద్(నాని) బొజ్జల సుధీర్ రెడ్డి, నెలవల విజయశ్రీ, కోనేటి ఆదిమూలం, కురుగొండ్ల రామకృష్ణ, భాను ప్రకాష్, మురళీ మోహన్, డా. వి.యం థామస్, మాజీ ఎంఎల్ఏ సుగుణమ్మ, తిరుపతి డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ, శ్రీకాళహస్తి ఆర్డిఓ భాను ప్రకాష్ రెడ్డి, తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.
అనంతరం టెంపుల్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఆశ కన్వెన్షన్ సెంటర్ నందు జరుగుతున్న అంతర్జాతీయ దేవాలయాల సమావేశంలో పాల్గొనడానికి రేణిగుంట విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు.
Prajavartha Online Telugu News