విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తన స్థలాన్ని కబ్జా చేశారని రెవెన్యూ. పోలీస్ అధికారులకు తమ సమస్య చెప్పిన పరిష్కారం కాలేదని ఎం లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. 35 సంవత్సరాల క్రితం తన మేనకోడలైన శ్రీలక్ష్మి పేరుతో కొన్న స్థలాన్ని చుట్టుపక్కల వారే కబ్జా చేశారని ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వంలో తమకు న్యాయం జరగలేదని కూటమి ప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తమ స్థలం కబ్జా అయిందని అధికారుల దృష్టికి తమ సమస్య తీసుకు వెళ్లిన పరిష్కారం కాలేదంటూ బొబ్బ శ్రీలక్ష్మి ఆమె మేనమామ ఎం లక్ష్మీనారాయణ మంగళవారం గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ 35 సంవత్సరాల క్రితం మంగళగిరి మండలం చిన్న కాకాని గ్రామంలో 600 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని కొని రిజిస్టర్ చేయించుకున్నామన్నారు. దానిని 9 సంవత్సరాల క్రితం దాని చుట్టూ ఉన్నవారు కబ్జా చేశారని తమకు న్యాయం చేయాలని పోలీసు రెవెన్యూ సర్వే రెవెన్యూ మినిస్టర్ గవర్నర్ ల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో నైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం కలిగిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును లోకేష్ బాబును కలిసి తమ సమస్యను వివరిస్తామన్నారు.
Prajavartha Online Telugu News