గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి రోజు ఉదయమే విధులు నిర్వహించే ప్రజారోగ్య కార్మికులు తప్పనిసరిగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మంగళవారం విధి నిర్వహణలో కారు ప్రమాదంలో మృతి చెందిన కార్మికురాలు జి.కొండమ్మ కుటుంబానికి నగరపాలక సంస్థ తరుపున పూర్తి అండగా ఉంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. మంగళవారం ప్రమాదంలో మృతి చెందిన కొండమ్మ మృతదేహాన్ని కమిషనర్ ఆదేశాల మేరకు సిఎంఓహెచ్ డాక్టర్ పి.జె.అమృతం, ప్రజారోగ్య అధికారులు ప్రభుత్వ వైద్యశాలలో పరిశీలించి, కుటుంబసభ్యులకు సానుభూతిని ప్రకటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజారోగ్య కార్మికురాలు జి.కొండమ్మ తమ రోజువారీ విధుల్లో భాగంగా మంగళవారం లాంచెస్టర్ రోడ్ స్వీపింగ్ చేస్తుండగా కార్ డీకొని మృతి చెందడం బాదకరమన్నారు. కొండమ్మ మృతికి నగరపాలక సంస్థ నుండి సంతాపం ప్రకటిస్తూ, వారి కుటుంబానికి అందాల్సిన మట్టి ఖర్చులు, ఇన్సూరెన్స్ వేగంగా అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించామన్నారు.
Prajavartha Online Telugu News