గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఇన్కంటాక్స్ చెల్లిస్తున్న ప్రతి ఉద్యోగి ఎంత, ఎందుకు చెల్లిస్తున్నది సమగ్రంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఇన్కంటాక్స్ అదనపు కమిషనర్ యన్. సుప్రియ ఐ.ఆర్.యస్ తెలిపారు. మంగళవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ ఆదేశాల మేరకు నగర పాలక సంస్థ అదనపు కమీషనర్ చల్లా ఓబులేసు తో కలిసి నగర పాలక సంస్థ ఉద్యోగులకు ఇన్కంటాక్స్ రిటర్న్స్ పై ఆ శాఖ అధికారుల ద్వారా అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.
సదరు సమావేశం నందు ఇన్కంటాక్స్ అదనపు కమిషనర్ మాట్లాడుతూ, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత కలిగిన పౌరునిగా తనకు వచ్చే ఆదాయంలో ఇన్కంటాక్స్ నిబంధనల ప్రకారం టాక్స్ చెల్లించాలన్నారు. చెల్లించే టాక్స్ లు మన దేశ అభివృద్దికె ఉపయోగిస్తారన్నారు. అవగాహనారాహిత్యంతో రిటర్న్స్ సబ్మిట్ చేస్తే, వాటిని స్క్రూటినీ చేయు సమయంలో తప్పులు బయటపడితే, ఫైన్ విధించుటయే కాక ప్రాసిక్యూషన్ కూడా చేస్తారని, దాని వలన అందరిముందు అభాసుపాలు కావాల్సి ఉంటుందన్నారు. ఇన్కంటాక్స్ తక్కువ వేయిస్తామని రాంగ్ రూట్ లో రిటర్న్స్ సబ్మిట్ చేయకూడదని, నిబంధనల ప్రకారం మనం ఎంత చేల్లిన్చాలో చేయాలో అంత చెల్లించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించిన ప్రతి బ్యాంకు ఎకౌంటు, పాన్ కార్డు అన్ని వివరాలు కూడా ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్ వద్ద ఉంటాయని, కావున మనం నిర్వహించే ప్రతి ట్రాన్సాక్షన్ సదరు డిపార్టుమెంటు వద్ద ఉంటుందని తెలియచేశారు. రానున్న సంవత్సరం నుండి 12 లక్షల గ్రాస్ దాటిన వారికే ఇన్కంటాక్స్ ఉంటుందని, అంత గ్రాస్ లేకపోయినా కూడా ప్రభుత్వ ఉద్యోగి తప్పనిసరిగా ఇన్కంటాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేయాలన్నారు. అంతేకాక నగర పాలక సంస్థ సచివాలయ కార్యదర్శుల ద్వారా కూడా ఇన్కంటాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
సదరు సమావేశంలో ఇన్కంటాక్స్ డిప్యూటి కమిషనర్ యన్.యస్.లలిత ఐ.ఆర్.యస్, అసిస్టెంట్ కమీషనర్ డి. వేణుగోపాల్ ఐ.ఆర్.యస్, నగర పాలక సంస్థ డిప్యూటి కమిషనర్ డి. శ్రీనివాసరావు, సెక్రటరీ పి. శ్రీనివాసరావు, నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News