Breaking News

పి.బి. సిద్ధార్థ కళాశాలలో ఘనంగా తెలుగు భాషా పోటీలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తల్లిదండ్రులను, గురువులను గౌరవించడంతోపాటు ప్రతి ఒక్కరూ మాతృభాషను కూడా గౌరవించాలని పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేక రమేష్ అన్నారు. శుక్రవారం ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం నేతృత్వంలో విజయవాడలోని పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, ఉయ్యూరు ఏ.జి. అండ్ ఎన్.జి. సిద్ధార్థ కళాశాల తెలుగుశాఖలు సంయుక్తంగా మాతృభాషా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన తెలుగు భాషా పోటీలలో గెలుపొందినవారికి ఆయనతోపాటు కళాపీఠం కార్యదర్శి బి.వి.ఎస్. ప్రకాష్ బహుమతులు అందచేశారు. తెలుగు పద్యాలాపన, గద్య పఠనం, అచ్చంగా తెలుగులో మాట్లాడటం, ఆంగ్లపదాలకు తెలుగుమాటలు రాయడం పోటీలలో 300 మందికి పైగా పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తెలుగు భాషాభిమానాన్ని చాటుకున్నారు. బహుమతి ప్రదాన కార్యక్రమంలో న్యాయనిర్ణేతలు విశ్రాంత ఉప ప్రాచార్యులు డాక్టర్ గుమ్మా సాంబశివరావు, వైస్ ప్రిన్సిపాల్ డా.కె.బాలకృష్ణ, ఉపాధ్యాయులు సీతామాలక్ష్మి, వలివేటి శివరామకృష్ణమూర్తిలతోపాటు తెలుగు శాఖాధిపతులు డా.ఎన్.శివకుమార్, ఎం . ఎల్.ఎన్.కుమారి, తెలుగు అధ్యాపకులు డా.పి నీరజ, గోవాడ శేషారత్నం, డాక్టర్
సశ్రీ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *