గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఎన్నికలల్లో ప్రిసైడింగ్ అధికారుల సూచనల మేరకు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్ కేంద్రాల్లో కేటాయించిన విధులు బాధ్యతగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ హాల్లో ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి అసిస్టెంట్ ప్రిసైడిండ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు మొదటి పోలింగ్ అధికారిగా ఓటర్ల జాబితా మార్కింగ్ చేసే కీలకమైన బాధ్యత వుంటుందన్నారు. పోలింగ్ ముందు రోజు పోలింగ్ మెటీరియల్ తీసుకోవడం నుండి పోలింగ్ కేంద్రాలు సిద్దం చేయుట , పోలింగ్ నిర్వహణ బ్యాలెట్ బాక్సులు పోలింగ్ కు సిద్దం చేయడం , పోలింగ్ ముగిసిన తరువాత బ్యాలెట్ బాక్సులు , ఎన్నికల సామాగ్రి రిసెప్షన్ సెంటర్లలో అప్పగించే అన్ని ప్రక్రియాలప ఏపిఓ లకు పూర్తి అవగాహన కలిగి వుండాలని , ప్రిసైడింగ్ అధికారులకు అవసరమైన సహకారం అందించాలన్నారు. ఏపిఓ ల విధులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. బ్యాలెట్ బాక్సులు పోలింగ్ కు సిద్దం చేయుట , పోలింగ్ ముగిసిన తర్వాత సీల్డ్ చేయడంపై ప్రాక్టికల్ గా శిక్షణ అందించారు.
సమావేశంలో అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News