Breaking News

మహాశివరాత్రి ఉత్సవ వేడుకల నిర్వహణ పై సమీక్ష

-అధికారులు  సమన్వయంతో  పనిచేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలి.
-ప్రతి ఘాట్ లో అవసరమైన బొట్స్ తో పాటు గజతగాళ్ళను , భద్రత ను ఏర్పాటు చెయ్యాలి.
-జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
భక్తులకు అత్యంత భక్తి ప్రాధాన్యమైన మహాశివరాత్రి పర్వదిన మహోత్సవాల ఏర్పాట్లను పటిష్టవంతంగా నిర్వహించి , సమన్వయం చేసుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు.

శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీ  జిల్లాలోని అన్ని ప్రముఖ శైవక్షేత్రాల్లో మహాశివరాత్రి ఉత్సవ నిర్వహణ ఏర్పాట్లపై.. జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్, డిఆర్ఓ టి. సీతారామమూర్తి, దేవాదాయ శాఖ, రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ , మత్స్య అధికారులతో కలసి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ముందస్తు ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ… ప్రధానంగా నగరంలో, జిల్లాలో వివిధ ప్రాంతాలలో వున్న శైవక్షేత్రాల్లో వేలాది మంది  భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు హజరవుతారన్నారు. వారందరికీ ఎలాంటి లోటుపాట్లు, ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు.

జిల్లాలో ముఖ్యంగా సీతానగరం మండలం వంగళపూడి నుంచి పట్టిసీమ వీరభద్ర స్వామి దేవస్థానం, కొవ్వూరు గోష్పాద ఘాట్, రాజమహేంద్రవరం నగరంలో పుష్కర ఘాట్, మార్కండేయ స్వామి దేవస్థానం ఘాట్, కోటిలింగాల ఘాట్స్కు వచ్చే భక్తులకు  ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చెయ్యాలన్నారు. పట్టిసీమలో తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు, దర్శన సమాచారాన్ని అందించే విధంగా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చెయ్యాలన్నారు. అదే విధంగా జిల్లాలోని అన్ని శైవక్షేత్రాల్లో కంట్రోల్ రూములను ఏర్పాటు చేయాలని కలెక్టర్ అన్నారు. ప్రతి ఘాట్ లో అవసరమైన బొట్స్ తో పాటు గజతగాళ్ళను , పోలీసు సిబ్బందిని ఏర్పాటు చెయ్యాలన్నారు.

జిల్లాలోని ప్రతి మండల కేంద్రాల్లోని శివాలయాలు వద్ద ప్రాంతాల్లో శానిటేషన్ పనులు సంబంధిత అధికారులతో సమన్వయమై మునిసిపల్, పంచాయతీ లు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సదరు దేవాలయాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లు ఆర్డబ్ల్యూఎస్ , మెడికల్ అధికారులతో కలిసి త్రాగునీటి సౌకర్యాన్ని, మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎక్కడైతే భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందో ఆ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యాలను అధికంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఉత్సవాలు జరిగే క్షేత్రాల్లో ఎక్కడా కూడా మద్యం అమ్మకాలు, సరఫరా జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎక్సయిజ్ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

అలాగే అన్ని ప్రాంతాల్లో వైద్య శిబిరాలు, 108 అంబులెన్స్ కు, అందుబాటులో వైద్యాధికారులు, వైద్య సిబ్బంది ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆయా శైవక్షేత్రాలకు అధిక సంఖ్యలో భక్తులు రానున్న సందర్భంగా ప్రతి చోటా మహిళలకు ఇబ్బంది లేకుండా పారిశుధ్యం,  తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.

భక్తులు రద్దిగా వున్న ప్రతి ప్రదేశంలో మైక్ సిస్టమ్, బారికేడ్స్, సిసి కెమెరాలు, స్నానాలు తరువాత డ్రెస్ చేంజింగ్ గదులను ఏర్పాటు చెయ్యాలన్నారు. కొవ్వూరు, రాజమహేంద్రవరం డివిజన్ లో మున్సిపల్ కార్యాలయంలో పట్టిసీమలో భక్తులకు సమాచారం అందించే విధంగా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చెయ్యాలాన్నారు.

అనంతర జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ మాట్లాడుతూ  మహా శివరాత్రి పండుగ సందర్భంగా అన్ని శైవక్షేత్రాలలో పోలీసు బందోబస్తు ఉండేవిధంగా చర్యలు తీసుకుంటామని, అవసరమైన చోట అధిక పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని ప్రముఖ శైవక్షేత్రాల వద్ద ఎస్.డి.ఆర్.ఎఫ్. సిబ్బంది, రెస్క్యూ టీమ్, ఫైర్ ఇంజన్ వాహనాలను అందుబాటులో ఉంచాలని సంబందిత అధికారులను ఆదేశించారు. పోలీసుల హెచ్చరిక నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ డి. నరసింహ కిషోర్, జిల్లా రెవిన్యూ అధికారి
టి.సీతారామ మూర్తి, అడిషనల్ ఎస్పి ఎల్. అర్జున్, ఆర్ డి ఓ లు కృష్ణ నాయక్, రాణి సుస్మిత, డి. ఎం హెచ్ ఓ డా. కె. వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతి అధికారి శాంతామణి, జిల్లా రవాణా అధికారి సురేష్, ఎండోమెంట్ అసిస్టెంట్ కమీషనర్ కె.నాగేశ్వరరావు, జిల్లా అగ్నిమాపక అధికారి ఎం. మార్టిన్ లూధర్ కింగ్, విద్యుత్ శాఖ ఎస్ ఈ కె.తిలక్ కుమార్ , అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, ఆర్ఎంసి ఎస్.ఈ.జి. పాండురంగారావు, డి ఎస్ పి బి రమణ కృష్ణ, కే.మహేష్ బాబు, ఎస్. భవ్య కిషోర్, డి.దేవకుమార్, లు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *