-రాజమండ్రి- విజయవాడ- శ్రీశైలం మూడు రోజుల (మూడు రోజులు/ రెండు రాత్రులు) టూర్ ప్యాకేజీ:
-ఫిబ్రవరి 25 న బయలుదేరి 27 కు తిరిగిరాక
-మూడు రోజుల పాటు వివిధ పుణ్యక్షేత్ర సందర్శన కోసం ఏర్పాట్లు చేసాం
-పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు సిహెచ్ పవన్ కుమార్
-ప్యాకేజీ ధర పెద్దలకు రాజమండ్రి నుంచి.. రు. 4360/-లు. పిల్లలు రు. 3490/- విజయవాడ నుంచి రు. 3490/-లు. పిల్లలు రు. 2550/-
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 18 సీట్లు గల మినీ వాహనం రాజమండ్రి నుండి విజయవాడ మీదుగా శ్రీశైలం వరకు టూరిస్టులు దైవ దర్శనం కొరకు ప్రత్యేక ప్యాకేజీ నిర్వహిస్తున్నామని పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు సిహెచ్ పవన్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సందర్శించే పుణ్యక్షేత్రాలు:
భ్రమరాంబిక దేవి ఆలయం (శక్తి పీఠం) శ్రీశైలం, శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం (జ్యోతిర్లింగం), శ్రీశైలం,
శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి దేవాలయం,
శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయం
సందర్శించి తిరిగి రాజమండ్రి చేరుకుంటారని తెలిపారు.
టూరిస్టులు పర్యటనలో భాగంగా వాహనం ఫిబ్రవరి 25 మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు రాజమండ్రి పర్యాటకశాఖ కార్యాలయం నుండి (సరస్వతి ఘాట్) బయలుదేరి రాత్రి 9 గంటలకు విజయవాడ హరిత బెర్మ్ పార్క్ కు చేరుకొని అక్కడ యాత్రికులను పికప్ చేసుకోవడం జరుగుతుంది, అనంతరం రాత్రి 10 గంటలకు విజయవాడ నుండి బయలుదేరి రెండో రోజు ఫిబ్రవరి 26 బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు శ్రీశైలం చేరుకుంటుందన్నారు.
అనంతరం భ్రమరాంబిక దేవి ఆలయం (శక్తి పీఠం) శ్రీశైలం, శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం (జ్యోతిర్లింగం), శ్రీశైలం,
శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి దేవాలయం,
శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయం
సందర్శించి తదుపరి ఫిబ్రవరి 26 రాత్రి 10 గంటలకు త్రిపురాంతకం నుండి విజయవాడ బయలుదేరుతుంది.
మూడో రోజు ఫిబ్రవరి 27 గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు విజయవాడ చేరుకొని , అక్కడ యాత్రికులను దించి సాయంత్రం ఐదు గంటలకు రాజమండ్రి చేరుకోవడం జరుగుతుందని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.
సందర్శించే పుణ్యక్షేత్రాలు:
-భ్రమరాంబిక దేవి ఆలయం (శక్తి పీఠం) శ్రీశైలం.
-శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం (జ్యోతిర్లింగం), శ్రీశైలం.
-శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి దేవాలయం
-శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయం
ఈ పర్యటనలో మొత్తం 900 కి. మీ. ఉంటుందని, ఒక్కొక్క టూరిస్ట్ కు
ప్యాకేజీ ధర పెద్దలకు రాజమండ్రి నుంచి.. రు. 4360/-లు. పిల్లలు రు. 3490/- విజయవాడ నుంచి రు. 3490/-లు. పిల్లలు రు. 2550/- ఉంటుందని ఆయన తెలిపారు.
దైవ దర్శనానికి వెళ్లేటప్పుడు ఒక మహిళా భక్తురాలు చీర లేదా చుడీదారు చున్నీతో ధరించవచ్చు. అయితే ఒక పురుష భక్తుడు దోతీ లేదా లుంగీని ఉత్తరీయం లేదా కుర్తా- పైజామాతో ధరించవచ్చుని, ఏదైనా దేవాలయాల వద్ద టాన్సరింగ్ ఛార్జీలు, ఏదైనా ఉంటే మార్గంలో ఆహారం & మొదలైనవి పర్యాటకులు (లు) మాత్రమే భరించాలన్నారు.
బుకింగ్ కోసం దయచేసి IRO, AP టూరిజం: 9848629341ను సంప్రదించవలననే ఆయన ఆ ప్రకటనలో కోరారు.
Prajavartha Online Telugu News