-రామకృష్ణ మిషన్ కేంద్రం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వారి ఆర్థిక సహాయంతో పౌష్టికా హార కిట్స్ పంపిణీ
-స్వామి రఘవీరానందజీ మహరాజ్
-ప్రాజెక్టు డైరెక్టర్, ఐసిడిఎస్ కే కె.విజయ కుమారి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గర్భిణీ స్త్రీలు, పిల్లలకు పాలిచ్చే తల్లులు పౌష్టికా హారం తప్పనిసరిగా తీసు కోవాలని ప్రాజెక్టు డైరెక్టర్, ఐసిడిఎస్ కే కె.విజయ కుమారి అన్నారు. శుక్రవారం శంభు నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక మెడికల్ క్యాంప్ లో స్వామి రఘవీరా నందజీ మహరాజ్, డి.ఎమ్. హెచ్.ఓ. కె. వెంకటే శ్వరరావు, ఐసిడిఎస్ కె.విజయ కుమారి లతో కలిసి రామకృష్ణ మిషన్ కేంద్రం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వారి ఆర్థిక సహాయం తో పౌష్టికాహార కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయ కుమారి మాట్లాడుతూ పిల్లలు ఆరోగ్యంగా ఉండా లంటే గర్భిణీ స్త్రీలు ఐరన్, కాల్షియం, విటమిన్లు ఉండే పోషకాలు వారు తీసుకునే ఆహారంలో ఉండే విధంగా చూసుకోవాలని తెలిపారు. ఐరన్, కాల్షియం విటమిన్లు, ఉండే విధంగా చూసు కుంటే పిల్లల ఐక్యూ పవర్ పెరుగు తుందని తెలిపారు. పిల్లలు బరువు, ఎత్తు, తెలివితేట లు పెరగాలంటే గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సంపూర్ణ పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా డి ఎం అండ్ హెచ్ ఓ, కె. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రామకృష్ణ మిషన్ కేంద్రం ఇన్ఫోసిస్ ఫౌం డేషన్ వారి ఆర్థిక సహాయం తో సి ఎస్ ఆర్ యాక్టివిటీ లో భాగంగా పౌష్టికాహార కిట్స్ ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు. 125 మంది గర్భిణీలు మరి యు బాలింతలకు, 75 మంది 0-3 సం॥లు వయస్సు గల పి ల్లలకు డా॥ సునీత, డా. ఎస్. మణికంఠ, వైద్య పరీక్ష లు నిర్వహించామన్నారు. వీరికి ఉచితంగా మందులు పంపిణీ మరియు పౌష్టికాహార కిట్స్ పం పిణీ చేయడం జరిగిందన్నారు.
రామకృష్ణ మిషన్ కేంద్రం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వారి ఆర్థిక సహాయంతో నిర్వహించే మాతా శిశు సంరక్షణ పథకంలో భాగంగా స్వామి రఘవీరానందజీ మహరాజ్ మాట్లాడుతూ ఫిబ్రవరి 11 వ తేదీ నుండి 8 మెడికల్ క్యాంపులు, 429 మంది గర్భిణీలు మరియు బాలింతలు, 277 మంది 0-3 సం॥లు వయస్సు గల పిల్లల కు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు మరి యు పోషకాహారం కిట్స్ పంపి ణీ చేయడం జరిగిందన్నారు. ఈ క్యాంపులు మార్చి నెలాఖ రు వరకు నిర్వహిస్తామని స్వామీజీ తెలియజేసారు.
గర్భిణీలు మరియు బాలింతల పౌష్టికాహార కిట్స్: 1) నువ్వుల ఉండలు 250 గ్రా॥లు, 2) ఆర్గానిక్ బెల్లం 250 గ్రా॥లు, 3) వేరుశనగ గుళ్లు చిక్కీ 250గ్రా॥లు, 4) అరిశెలు 7, 5) డ్రైఫ్రూట్స్ లడ్డులు 100 గ్రా॥లు, 6) ఖర్జూరం 500గ్రా॥లు, 7) కరివేపాకు పొడి 100 గ్రా॥లు, 8) మునగాకు పొడి 100 గ్రా॥లు, 9) హేండ్ వాష్ 100 మి.లీ., 10) టూత్ బ్రష్ 1, 11) నెయిల్ కట్టర్ 1.
0-3 వయస్సు గల పిల్లలకు పౌష్టికాహార కిట్స్: 1) తేనె 100 గ్రా॥లు, నెయ్యి 100గ్రా॥లు, వేరుశనగ గుళ్లు చిక్కీ 250గ్రా॥లు,పెసరపప్పు 250 గ్రా॥లు, రాగిపిండి 250గ్రా॥లు, బన్సీరవ్వ 250 గ్రా॥లు, కందిపప్పు 250గ్రా॥లు, ఆర్గానిక్ బెల్లం 250గ్రా॥లు, చ్యవనప్రాశ 250 గ్రా॥లు అందచేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి.ఎమ్.హెచ్.ఓ. పి. ప్రసన్న లక్ష్మి, వార్డు మెంబర్, కే ఆటోని దాస్, జి.రామారావు డా॥ దిలీప్ కుమార్, డా॥ సంధ్య, ఏ.ఎన్. ఎమ్లు, రామకృష్ణ మిషన్ సిబ్బంది, వాలంటరీలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News