Breaking News

రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి.

-బ్లాక్ స్పాట్లలో లైటింగ్, సైన్ బోర్డ్, బ్లింకర్స్ ఏర్పాటుకు చర్యలు
-ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ కోసం హెల్మెట్, సీట్ బెల్ట్ ఉపయోగించి ప్రయాణం చేయాలి
-జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని , వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, అవగాహన తో పాటు నియమాలు పాటించే చొరవ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్నరాముడు విజ్ఞప్తి చేశారు.

శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశం కు జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్నరాముడు అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్నరాముడు మాట్లాడుతూ రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలన్నారు. ప్రజలు నియమ నిబంధనలు పాటించేలా స్వీయ రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో 27 జాతీయ, 6 రాష్ట్ర, 2 ఇతర రహదారులలో 35 బ్లాక్ స్పాట్స్ లో గుర్తించడం జరిగిందని, ఆయా ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాలు జరిగాయన్నారు. రోడ్డు ప్రమాదాలను, మరణాలను తగ్గించడానికి కావలసిన జాగ్రత్తలు పాటించాలన్నారు. బ్లాక్ స్పాట్లలో లైటింగ్, సైన్ బోర్డ్, బ్లింకర్స్ సిగ్నల్ , జీబ్రా లైన్స్ , స్పీడ్ బ్రేకర్ లాంటివి ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదాలు జరిగే చోట ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలపాలని, సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ రహదారుల్లో కొన్నిప్రదేశాల్లో ప్లాంటేషన్, లైటింగ్ చేపట్టాలన్నారు.

మోటార్ వాహనాల చట్టం పరిధిలో 2023 ఏడాది లో 11,849 కేసులు నమోదు చేసి, రూ.10,32,72,000 లు జరిమానా విధించడం జరిగిందని తెలిపారు. 2024 లో 4,204 కేసులు నమోదు చేసి రూ,8,82,41,000 లు జరిమానా విధించామన్నారు. కోర్ట్స్ ఆధ్వర్యంలో 2023 లో 45 కేసులకు రూ.67,500 , 2024 లో 15 కేసులకు రూ.20 వేల అపరాధ రుసుం వెయ్యడం జరిగిందని తెలిపారు.

 

ఎన్జీవోలు రాబోయే రోజుల్లో ఇంకా ప్రత్యేకంగా రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలతో పాటు రోడ్డు భద్రతపై స్లొగన్స్ ప్రదర్శించాలన్నారు. రాజమహేంద్రవరం నగరంలో సీసీ కెమెరాల నిర్వహణ, దాని ఫీడ్ పోలీస్, జిల్లా కంట్రోల్ రూమ్ లోకి రావాలన్నారు.

ప్రమాదం జరిగిన తొలి గంట గోల్డెన్ అవర్ జేసీ చిన్న రాముడు అన్నారు. ప్రమాదం జరిగిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తే విలువైన ప్రాణాలు దక్కుతాయని తెలిపారు. నేషనల్ హైవే హెల్ప్ లైన్ (ఎమర్జెన్సీ ) నెంబర్ 1033 పై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. జాతీయ రహదారులపై ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  నగరంలో పలుచోట్ల నెలకొన్న ట్రాఫిక్ సమస్యలను నివారించాలని, నగరంలోని పోలీస్ పెట్రోల్  బంకు వద్ద ఇతర రద్దీ ప్రదేశాలలో వాహనదారులు సౌండ్ పొల్యూషన్ చేయకుండా ఉండేందుకు, అవగాహన కల్పించే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమైన కూడళ్ల ప్రాంతాల్లో పార్కింగ్ ప్రాంతాలను  లైట్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలన్నారు.

చిన్న పిల్లలు లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం జరిగిందని, అటువంటి సందర్భాల్లో తల్లితండ్రుల పై కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది.

2024 లో మోటారు వాహనాల డ్రైవింగ్ ఉల్లంఘన కు సంబంధించి 84,557 ఉల్లంఘన కేసులు నమోదు చేసి 3,30,03,334 పెనాల్టీ వెయ్యడం జరిగిందని జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ తెలిపారు. హెల్మెట్ ధరణ కోసం ఎన్ని సార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ఇంకా ప్రజల్లో చైతన్యం రావడం లేదన్నారు. 2025 జనవరి ఒక్క నెలలో 10,122 కేసులు నమోదు చేసి రూ.41,46,041 లు వసూలు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం తో సమన్వయం చేసుకుంటూ విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గౌరవ సుప్రీం కోర్టు, హై కోర్టు ఆధారాలతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి నట్లు తెలిపారు.

– ఈ సమావేశంలో డిటిసి ఆర్. సురేష్ , ఆర్.అండ్.బి ఎస్.ఈ ఎస్.బి.వి రెడ్డి, డిఎంహెచ్ఓ డా. కే. వెంకటేశ్వరరావు, నేషనల్ హైవే పిడి డి సురేంద్రనాథ్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. వాసుదేవ రావు, ఆర్ ఎం వో వీ. వినూత్న, పోలీస్, ఏపీఎస్ఆర్టీసీ ఈ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *