-వేలము తేది. 27.02.2025
-ఉదయం గం. 11.00లకు
-ప్రదేశము: సెంట్రల్ జైలు, రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇందుమూలముగా యావన్మందికి తెలియజేయునది ఏమనగా సెంట్రలైజైలు, రాజమహేంద్రవరం నకు సంబందించిన పాక్షిక ఆరుబయలు కారాగార ప్రాంగణములో సూమరు 10 ఎకరాల విస్థీరణంలో బంగినపల్లి, కొత్తపల్లి కొబ్బరి, పెద్దరసాలు, చిన్నరసాలు, చెరుకురసాలు, సువర్ణరేఖ, మల్లికలు మరియు దేశవాళి రకాలైన మామిడి చెట్ల పంటను శ్రీయుత జైళ్ళ శాఖాధిపతి మరియు సంస్కరణల సేవల సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశముల మేరకు ది. 27.02.2025న ఉదయం గం. 11.00లకు శ్రీయుత జైళ్ళ ఉప శాఖాధికారి, కోస్తాంధ్ర ప్రాంతం, రాజమహేంద్రవరం వారి సమక్షంలో సెంట్రల్ జైలు ప్రాంగణము నందు గంటలకు బహిరంగ వేలం వేయబడునని కేంద్ర కారాగారము పర్యవేక్షణాధికారి ఎన్ రాహుల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.
ఈవేలంపాటలో పాల్గొనే ఆసక్తిదారులు రూ.30,000/-లు(అక్షరాల ముఫైవేల రూపాయలు మాత్రమే) ధరావత్తు సొమ్ము చెల్లించి వేలములో పాల్గొనవచ్చును. వేలంపాటలో నెగ్గిన పాటదారుడు పాడిన మొత్తంను ఒకే దఫాగా అదేరోజు నగదుగా చెల్లించి పంటను స్వాధీనపరచు కొనవచ్చును. అలా చేయని ఎడల అతని దరావత్తు సొమ్మును ప్రభుత్వ ఖజానాకు జమచేయబడును. వేలంపాటలో నెగ్గనిపాటదారులకు ధరావత్తు సొమ్మును వెంటనే వాపసు ఇవ్వబడును.
కావున ఈ వేలంపాటను ఆమోదించుటకు గాని, నిరాకరించుటకుగాని, శ్రీయుత జైళ్ళ ఉపశాఖాధికారి, కోస్తాంధ్రప్రాంతము, రాజమహేంద్రవరం వారికి పూర్తి అధికారము కలదు.
ఈ వేలము విషయమై ఇతర సమాచారములు తెలుసుకొనవలెనన్న మరియు మామిడి తోటను పరిశీ లించుటకు ఈకార్యాలయపు పని దినములలో ఉదయం 10-00 గంటలనుండి మధ్యాహ్నం 01-00 గంట వరకు మరియు మధ్యాహ్నం 02-00 గంటల నుండి సాయంత్రం 05-00 గంటల వరకు ఈ దిగువ తెలిపిన ఫోన్ నెంబర్ లకు ఫోన్ చేసి తెలుసుకొనవచ్చును.
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు:
జైలర్ (ఎస్ ఓ వి ) – 9441363659.
మెయిన్ గేట్ -0883-24719990.
Prajavartha Online Telugu News