Breaking News

రోజు వారి సర్వే బృందాలకు నిర్దేశించిన ప్రకారం రీ సర్వే ప్రక్రియ చేపట్టాలి…

గోకవరం,  నేటి పత్రిక ప్రజావార్త :
రోజు వారి సర్వే బృందాలకు నిర్దేశించిన ప్రకారం రీ సర్వే ప్రక్రియ చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. శుక్రవారం గోకవరం మండలం మల్లవరం గ్రామంలో రీ సర్వే పనుల గ్రౌండ్ ట్రూథింగ్ పనుల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ, సగటున సర్వే బృందాలు రోజుకి 15 ఎకరాల్లో సర్వే నిర్వహించాల్సి ఉందన్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 139 బృందాలను నియమించామన్నారు. అయితే ఆమేరకు పురోగతి లేదని తెలిపారు . దేవరపల్లి మండలంలో 59.84 ఎకరాల్లో , గోకవరం మండలంలో 44.9 ఎకరాల్లో నిన్నటి రోజున పూర్తి చెయ్యగా, పురోగతిలో కొవ్వూరు 15.75 ఎకరాలు , గోపాలపురం 22.52 ఎకరాలు తో దిగువున ఉన్న యన్నారు. జేసి వెంట జిల్లా సర్వే అధికారి బి లక్ష్మి నారాయణ, మండల రెవిన్యూ, సర్వే అధికారులు, సచివాలయ సిబ్బంది, రైతులు భూ యజమానులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

హంద్రీనీవా జలాలకు సీఎం జల హారతి

-కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద ప్రత్యేక పూజలు -బీరగానిపల్లె రిజర్వాయర్ శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు అమరావతి, నేటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *