Breaking News

ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులను సమన్వయం చేసుకుంటూ అప్రమత్తంగా ఉంటూ బాధ్యత పర్యవేక్షణ చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా కొనసాగించేందుకు ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులను సమన్వయం చేసుకుంటూ అవసరమైన సహకారం అందిస్తూ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ బాధ్యత పర్యవేక్షణ చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మైక్రో అభ్జర్వర్లను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ హాల్లో ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలకు నియమించిన మైక్రో అభ్జర్వర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల జనరల్ అభ్జర్వర్ వి. కరుణ , రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి , జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియను సమర్ధవంతంగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు ఓటర్లలో మరింతగా కాన్పిడెన్స్ ను పెంచేందుకే ఎన్నికల సంఘం ప్రతి పోలింగ్ కేంద్రంలోను అభ్జర్వర్ తరుపున మైక్రో అభ్జర్వర్లను నియమించటం జరిగిందన్నారు. మైక్రో అభ్జర్వర్లకు పోలింగ్ అధికారులు పోలింగ్ డే ముందు రోజు డిస్టిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ మెటీరియల్ ను తీసుకోవటం, పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లు, పోలింగ్ నిర్వహణ, తిరిగి పోలింగ్ మెటీరియల్ రిసెప్షన్ కేంద్రాల్లో అప్పగించే వరకు అన్ని ప్రక్రియలో పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలింగ్ డే కి ముందు రోజు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ అధికారులు తీసుకున్న మెటీరియల్ ను పూర్తి స్థాయిలో పరిశీలించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం ప్రిసైడింగ్ అధికారులు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి అవసరమైన సహకారం అందించాలన్నారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం బ్యాలెట్ బాక్స్ లు పోలింగ్ కు సిద్ధం చేయటం, అభ్యర్ధుల ఏజెంట్లకు గుర్తింపు కార్డుల జారీ, నిర్దేశించిన సమయానికి ఉదయం 8.00 గంటలకు పోలింగ్ ను ప్రిసైడింగ్ అధికారులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ సమయంలోను పోలింగ్ అధికారులు నిర్దేశించిన విదులు సక్రమంగా నిర్వర్తించేలా పర్యవేక్షించాలన్నారు. పోలింగ్ ముగిసిన తరువాత బ్యాలెట్ బాక్స్ లు సక్రమంగా సీల్డ్ వేయటం, ప్రిసైడింగ్ అధికారులు నిర్దేశించిన ఫారాలు సక్రమంగా పూర్తి చేసే ప్రక్రియలోను సహకారం అందించాలన్నారు. బ్యాలెట్ బాక్స్ లను పోలింగ్ కేంద్రాల నుంచి పూర్తి రక్షణతో రిసెప్షన్ కేంద్రాలకు తరలించి, అప్పగించేలా పర్యవేక్షణ చేయాలన్నారు. మైక్రో అభ్జర్వర్లు పర్యవేక్షించాల్సిన అంశాలను పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ వివరించారు. బ్యాలెట్ బాక్స్ ను పోలింగ్ కు సిద్ధం చేయుట, సీల్డ్ చేసే ప్రక్రియ పైన హ్యాండ్స్ ఆన్ శిక్షణను అందించారు.
సమావేశంలో మైక్రో అభ్జర్వర్లుగా నియమించిన బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *