గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఫిబ్రవరి 27న జరగనున్న గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ నోడల్ అధికారులను ఆదేశించారు. సోమవారం కమీషనర్ ఛాంబర్ నందు యం.యల్.సి ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ స్టేషన్లలో మౌలిక వసతుల కల్పన పై యం.యల్.సి ఎన్నికల విధులు కేటాయించబడిన నోడల్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన చర్యల పై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, ఈ నెల 27 వ తేదీన జరగనున్న యం.యల్.సి ఎన్నికలకు సంబంధించి విధులు కేటాయించబడిన నోడల్ అధికారులు పోలింగ్ స్టేషన్ల లో పారిశుధ్య పనులు, అవసరమైన బ్యారికేడింగ్, త్రాగు నీరు మరియు ఇతర మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. అంతేకాక ఎన్నికల నిర్వహణకు సిబ్బందికి ఫిబ్రవరి 26 న వస్తారని వారు నైట్ ఉండటానికి అవసరమైన కరెంట్ అల్పాహారం, భోజనం మరియు త్రాగు నీరు వంటివి ఏర్పాటు చేయాలని, వారి నుండి ఎటువంటి పిర్యాదులు రాకుండా చూడాలన్నారు. నోడల్ అధికారులు ప్రజారోగ్య మరియు ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. అంతేకాక ఎన్నికల నిర్వహణ లో వీడియోగ్రాఫర్లు ప్రతి పోలింగ స్టేషన్లో ఉండేలా చూడాలని మరియు వెబ్ కాస్టింగ్ వంటివి తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఎన్నికలు జరిగే సమయంలో బి.యల్.ఓ లు అందుబాటులో ఉండాలని నోడల్ అధికారులను ఆదేశించారు.
సదరు సమావేశంలో ఎలక్షన్ సెల్ సూపరింటేడెంట్ పద్మనాభరావు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News