Breaking News

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్బంగా మద్యం దుకాణాలను 48 గంటలపాటు మూసివుంచాలి

-ఈనెల 25వ తేదీ సాయంత్రం 4.00 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4.00 గంటల వరకు నిబంధనలు వర్తింపు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 27వ తేదీన ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరిగే పట్టభధ్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పరిధిలో అన్ని మద్యం దుకాణాలను 48 గంటలపాటు మూసివుంచే విధంగా ఆంధ్రప్రదేశ్ ఛీప్ ఎలక్ట్రోరల్ అధికారి ఉత్తర్వులు జారీచేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీ కే బాలాజీ ఉత్తర్వులు జారీచేశారు.

ప్రజా ప్రాతినిధ్య చట్టం -1951 లోని సెక్షన్ 135 సి ప్రకారం ఈసీఐ, ఏపీ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా పరిధిలో మద్యం దుకాణాలను, బార్లను ఈనెల 25వ తేదీ సాయంత్రం 4.00 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4.00 గంటల వరకు డ్రై డేగా పాటించి తప్పనిసరిగా మద్యం దుకాణాలను మూసిఉంచాలని, ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేసేందుకు జిల్లా ప్రొఫెషన్ ఎక్సైజ్ అధికారులను ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *