Breaking News

పోలింగ్ ఏజెంట్ల‌కు ఎంపి కేశినేని శివ‌నాథ్ దిశా నిర్దేశం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 27వ తేదీన జ‌రిగే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల‌కు ఎన్డీయే కూట‌మి ప‌శ్చిమ‌నియోజ‌క‌వ‌ర్గంలో పోలింగ్ ఏజెంట్స్ ను నియ‌మించింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం విద్యాధ‌ర‌పురంలోని ఆర్య‌వైశ్య కార్పొరేష‌న్ చైర్మ‌న్ డూండీ రాకేష్ కార్యాల‌యంలో పోలింగ్ ఏజెంట్స్ తో ఎంపి కేశినేని శివ‌నాథ్ స‌మావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో మూడు పోలింగ్ కేంద్రాల ప‌రిధిలో 15 పోలింగ్ బూత్ లు వున్నాయ‌న్నారు. పోలింగ్ ఏజెంట్స్ విధివిధానాలు వివ‌రించారు. కూట‌మి నాయ‌కులు పోలింగ్ కేంద్రాల‌కు స‌మీపంలో ఓట‌రు జాబితాలు,స్లిప్పులు అందుబాటులో వుంచుకోవాల‌న్నారు. ఎన్డీయే కూటమి బ‌ల‌ప‌ర్చిన‌ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు ప‌ట్ట‌భ‌ద్రులు మొద‌టి ప్రాధాన్య‌త ఓటు వేసేలా చూడాల‌ని సూచించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆర్య‌వైశ్య కార్పొరేష‌న్ చైర్మ‌న్ డూండీ రాకేష్,, టిడిపి మైనార్టీ సెల్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మ‌హ‌మ్మ‌ద్ ఫ‌తావుల్లాహ్, బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, టిడిపి జిల్లా వాణిజ్య విభాగ అధ్య‌క్షుడు సొలంకి రాజు, క్ల‌స్ట‌ర్ ఇన్చార్జ్ యెదుపాటి రామ‌య్య ల‌తోపాటు ఎన్డీయే కూట‌మి నాయ‌కులు ,కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *