Breaking News

ఎన్నికల ఓటింగ్ పారదర్శకంగా సజావుగా జరిగేలా చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల ఓటింగ్ పారదర్శకంగా, ప్రశాంత వాతావారణంలో సజావుగా జరిగేలా అవసరమైన చర్యలు పటిష్టంగా చేపట్టాలని ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల సాధారణ అభ్జర్వర్ వి కరుణ ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోకవర్గ పరిధిలోని జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు సూచించారు.
మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల సాధారణ అభ్జర్వర్ వి కరుణ, ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ్ తేజ తో కలసి ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల ఓటింగ్ పై ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, బాపట్ల, ఏలూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోకవర్గ శాసనమండలి ఎన్నికల సాధారణ అభ్జర్వర్ వి కరుణ మాట్లాడుతూ శాసనమండలి ఎన్నికలు 27-02-2025 జరుగుతున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కు అవసరమైన అన్ని చర్యలు పూర్తి స్థాయిలో సిధ్ధం చేయాలన్నారు. ప్రీ పోల్ డే కు సంబంధించి అన్ని ప్రక్రియలు సక్రమంగా చేపట్టాలన్నారు. పోలింగ్ మెటీరీయల్ పోలింగ్ అధికారులకు బుధవారం డిస్టిబ్యూషన్ కేంద్రాల్లో పంపిణీ చేసి పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీలు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్ట్ ఏర్పాట్లు సత్వరమే పూర్తి అయ్యేలా పర్యవేక్షించాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్లు వరకు 144 సెక్షన్ ను విధించాలన్నారు. బైండవర్లు పూర్తి చేయాలన్నారు. పోలింగ్ రోజు డ్రై డే గా ప్రకటించి మద్యం షాపులు మూసివేయించాలన్నారు. ఓటు వేయటానికి వచ్చే వీఐపీలకు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోకవర్గ శాసనమండలి ఎన్నికల ఓటింగ్ సక్రమంగా జరిగేలా జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు.
రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ మాట్లాడుతూ జిల్లాలో శాసనమండలి ఎన్నికల ఓటింగ్ కు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని, పోలింగ్ కేంద్రాలు వారీగా బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల సామాగ్రిని సిధ్ధం చేయటం జరిగిందని, బుధవారం ఉదయం నుంచి పోలింగ్ అధికారులకు ఎన్నికల సామగ్రిని డిస్టిబ్యూషన్ కేంద్రాల్లో పంపిణీ చేయటం జరుగుతుందన్నారు. పోలింగ్ కేంద్రాల్లోను అవసరమైన ఏర్పాట్లు సిధ్దం చేయటం జరిగిందన్నారు. పోలింగ్ మెటీరియల్ తరలింపుకు రూట్ ప్లాన్ సిద్దం చేయటం జరిగిందన్నారు జిల్లా ఎస్పీని సమన్వయం చేసుకొని పోలింగ్ కేంద్రాల వద్ద, పోలింగ్ మెటీరియల్ రవాణాకు బందోబస్తు ప్లాన్ రూపొందించటం జరిగిందన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ, బాపట్ల జిల్లా కలెక్టర్ మురళి, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు శాసనమండలి ఎన్నికల ఓటింగ్ కు సంబంధించి ఏర్పాట్లు వివరిస్తూ పోలింగ్ సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణను పూర్తి చేయటం జరిగిందని, పోలింగ్ కు సంబంధించి బ్యాలెట్ పేపరు, ఎన్నికల సామాగ్రిని పోలింగ్ కేంద్రాల వారీగా వేరు చేయటం జరిగిందన్నారు. పోలింగ్ అధికారులకు బుధవారం ఉదయం నుంచి ఎన్నికల మెటీరియల్ పంపిణీకి డిస్టిబ్యూషన్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని, పోలింగ్ ముగిసిన తరువాత ఎన్నికల మెటీరీయల్ తీసుకోవటానికి రిసెప్షన్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశామన్నరు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయటం జరిగిందని, వెబ్ కాస్టింగ్ పనులు బుదవారం నాటికి పూర్తి అవుతాయన్నారు. రూట్ ప్లాన్, బందోబస్తు ప్లాన్ సిధ్దం చేయటం జరిగిందన్నారు. శాసనమండలి ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సిధ్దం చేశామన్నారు.
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిశోర్, కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు , బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ దూడి మాట్లాడుతూ శాసనమండలి పోలింగ్ కు పోలింగ్ కేంద్రాలు వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు, క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల వద్ద అదనపు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. స్ట్రైకింగ్ ఫోర్సులు, సాయిధ పోలీసు బలగాలు సిధ్దం చేయటం జరిగిందన్నారు. గత ఎన్నికల్లో కేసులలో ఉన్న వ్యక్తులను బైండవర్లు చేయటం జరిగిందన్నారు. ఎక్సైజ్ శాఖ ద్వారా పోలింగ్ రోజు మద్యం షాపులు మూసివేయటం జరుగుతుందన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి, జిల్లా రెవెన్యూ డివిజన్ అధికారి శ్రీనివాసులు, ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ మల్లేశ్వరి పాల్గోన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *