గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలు పారదర్శకంగా, సజావుగా, ప్రశాతంగా జరిగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా సిధ్దం చేశామని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ తెలిపారు.
మంగళవారం కలెక్టరేట్ లొని డీఆర్సీ హాలులో రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి తో కలసి ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలకు ఓటింగ్ ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 4.00 వరకు జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించిందన్నారు. పోలింగ్ కేంద్రంకు ఓటర్లు ఎన్నికల సంఘం నిర్దేశించిన గుర్తింపు కార్డులు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు, విద్యాసంస్థల ఉద్యోగుల గుర్తింపు కార్డు, ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు, విభిన్న ప్రతిభావంతులకు జారీ చేసిన గుర్తింపు కార్డులు తదితర 10 గుర్తింపు కార్డులలో ఎదో ఒకటి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రాలలోకి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకొని వెళ్ళరాదన్నారు. ఓటర్లకు పోలింగ్ బూత్ వివరాలను తెలియచేయటానికి ప్రతి మండల తహశీల్దారు కార్యాలయంలోను, జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రత్యేకంగా కేంద్రాలలో ఓటర్ల జాబితా తో ఉద్యోగులు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశామని, అక్కడికి వెళ్ళి ఓటర్లు వారి ఓటు నమోదైన పోలింగ్ కేంద్రం వివరాలు, చిరునామా తెలుసుకోవచ్చని, ఫోన్ ద్వారా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం కు ఫోన్ చేసిన వివరాలు తెలియచేస్తారన్నారు. శాసనమండలి ఎన్నికలు మొదటి ప్రాధాన్యత విధానం ద్వారా ఓటు నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. చెల్లుబాటు అయ్యే విధంగా ఓటు నమోదు చేసుకునే మార్గదర్శకాలను వివరిస్తూ పోలింగ్ బూత్ ల వద్ద పోస్టర్లను ప్రదర్శించటం జరుగుతుందని, ఓటర్లు పోస్టర్లో తెలిపిన విధానంలో సక్రమంగా ఓటు నమోదు చేసుకోవాలన్నారు. పట్టభధ్రుల శాసనమండలి ఎన్నికల్లో 25 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారని, బ్యాలెట్ పేపర్లో వారి సీరియల్ నెంబరు, పేరు, ఫోటో, ఏ పార్టీ తరుపున పోటీ చేస్తుందని వంటి వివరాలతో కూడిన పోస్టర్ ను పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. దీనిలోని వివరాలు తెలుసుకొని ఓటర్లు వారికి నచ్చిన అభ్యర్ధికి మొదటి ప్రాధాన్యత ఓటు, ఇతర అభ్యర్ధులకు రెండు, మూడు తదితర ప్రాధాన్యత ఓటు నమోదు చేసుకోవచ్చన్నారు. బ్యాలెట్ పేపరు పై ప్రాధాన్యత ఓటు అంకెల నమోదుకు పోలింగ్ అధికారులు బ్యాలెట్ పేపరుతో పాటు ఎన్నికల సంఘం నిర్దేశించి వైలెట్ కలర్ స్కెచ్ పెన్నును ఇవ్వటం జరుగుతుందని, దీని ద్వారా మాత్రమే బ్యాలెట్ పేపరుపై ప్రాధాన్యత ఓటు నమోదు చేసుకోవాల్సిదిగా ఓటరుకు సూచించడం జరుగుతుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి ఓటర్లు వారి స్వంత పెన్నులతోనే ఓటు నమోదు చేసుకోవచ్చన్నారు. శాసనమండలి ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమాళిని కచ్చితంగా పాటించాలని, నిబంధన ఉల్లంఘించితే సీరియస్ గా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అభ్యర్ధుల ప్రచార కార్యక్రమాలు ఎన్నికలకు 48 గంటలు ముందుగా మంగళవారం సాయంత్రం 4.00 గంటలతో ముగుస్తుందన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టడం, వారిని బెదిరించటం వంటి కార్యక్రమాలను అభ్యర్థులు చేపట్టరాదని, దీనికి సంబంధించి ఎమైన పిర్యాదులు ఉంటే కలెక్టరేట్ లోని కంట్రోల్ రూంకు సమాచారం అందించితే చర్యలు తీసుకుంటామన్నారు. పోలింగ్ రోజు అభ్యర్ధులు పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని, పోలింగ్ కేంద్రానికి 100 మీటర్లు, 200 మీటర్లు లోపు పోలింగ్ రోజు ప్రచార కార్యక్రమాలు నిర్వహించటం నిషేధం అన్నారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు వాహనాల్లో తరలించటం వంటి కార్యక్రమాలు చేపట్టరాదన్నారు. అభ్యర్ధలు ఎన్నికల ప్రవర్తన నియమావళికి నిభంధనలు ఉల్లంఘించితే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్ నియమించుకోవచ్చని, పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ ప్రారంభానికి గంట ముందే పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలన్నారు. పెన్ను పెన్సిల్, వారికి సంబంధించిన ఇనుపసీలు, ఓటర్ల జాబితా ను పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలలోకి తీసుకు వెళ్ళవచ్చును, పోలింగ్ సిబ్బందికి సహకరించి పోలింగ్ సక్రమంగా జరిగేలా వ్యవహరించాలన్నారు. పోలింగ్ సందర్భంగా డ్రై డే గా ప్రకటించి మద్యం షాపులను పోలింగ్ ముగిసే వరకు మూసివేయటం జరుగుతుందన్నారు. పట్టభధ్రుల శాసనమండలి ఎన్నికల్లో 3,47,116 మంది ఓటర్లు ఉన్నారన్నారు. శాసనమండలి ఎన్నికల్లో ఓటర్లైన ఉద్యోగులందరూ వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా యాజమాన్యాలు ఓటింగ్ రోజు 27-02-2025 ప్రత్యేక క్యాజువల్ లీవ్ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, వ్యాపార ,విద్యాసంస్థలు వారి సంస్థల్లోని ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటానికి సెలవు కోరితే మంజూరు చేయాలన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలు జరిగే 483 పోలింగ్ కేంద్రాలలో పూర్తిస్థాయిలో మౌలిక సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి మైక్రో అబ్జర్వర్ ను నియమించడం జరిగిందని వెబ్ కాస్టింగ్ , వీడియోగ్రఫీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో లోపల ఒక కెమెరా, వెలుపల క్యూలైన్ల వద్ద పరిస్థితిని తెలుసుకునేందుకు ఇంకో కెమెరాతో వెబ్ కాస్టింగ్ జరుగుతుందన్నారు. జిల్లా ఎస్పీలు పోలీస్ శాఖల సమన్వయంతో పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు గా గుర్తించిన 140 పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకోని అదనంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. పోలింగ్ నిర్వహణకు సంబంధించి అవసరమైన పిఓలు , ఏపీవోలు , ఓపిఓలు , మైక్రో అబ్జర్వర్లు , సెక్టార్ ఆఫీసర్లను నియమించడం జరిగిందని వారికి ఇప్పటికే పోలింగ్ ప్రక్రియపై రెండు విడతలు శిక్షణ అన్ని జిల్లాల్లోనూ అందించడం జరిగిందన్నారు. పోలింగ్ మెటీరియల్ కు సంబంధించి బ్యాలెట్ బాక్స్ లను సిద్ధం చేయడం ప్రింట్ అయి వచ్చిన బ్యాలెట్ పేపర్ వెరీఫై చేయడం , ఇతర పోలింగ్ సామాగ్రిని సిద్ధం చేసి పోలింగ్ స్టేషన్ వారీగా బండ్లింగ్ పూర్తి చేయడం జరిగిందన్నారు. పోలింగ్ మెటీరియల్ సంబంధిత జిల్లాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో బుధవారం ఉదయం నుంచి పోలింగ్ అధికారులకు పంపిణీ చేయడం జరుగుతుందని, పోలింగ్ పూర్తి అయిన తర్వాత సంబంధిత జిల్లాల్లో రిసెప్షన్ కేంద్రాల్లోనే పోలింగ్ సామాగ్రి స్వీకరించడం జరుగుతుందన్నారు. బ్యాలెట్ పేపర్ల కౌంటింగ్ జిల్లాలోని ఏసీ కళాశాలలో నిర్వహిస్తున్నందున అన్ని జిల్లాల్లో రిసెప్షన్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులు ఏసీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముకు తీసుకువచ్చి అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూములో భద్రపరిచి సీల్డ్ వేయడం జరుగుతుందన్నారు. పోలింగ్ రోజు ఓటర్లకు ఇబ్బందులు , పోలింగ్ సంబంధించి ఇతర సమస్యలు వుంటే కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నెంబరు 0863 2241029 కి ఫోన్ చేస్తే వెంటనే అధికారులు పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటారన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలు ఏర్పాట్లు ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ప్రకారం , అబ్జర్వర్ సూచనల మేరకు సిద్ధం చేయడం జరిగిందని, ఏర్పాట్లపై పోటీలో ఉన్న అభ్యర్థులకు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి తెలియజేయడం జరిగిందన్నారు. శాసనమండలి ఎన్నికలు సజావుగా , ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు, ఓటర్లు సహకరించాలన్నారు.
Prajavartha Online Telugu News