గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి కృష్ణ – గుంటూరు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గానికి జరిగే ఎన్నికలకు సంబంధించి స్థానిక ఏ.సి కళాశాలలో రిసెప్షన్ సెంటర్లు , డిస్ట్రిబ్యూషన్ సెంటర్ , కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్లను మంగళవారం సాయంత్రం రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ , తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా లతో కలసి పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు. ఫిబ్రవరి 26 వ తేదీన పోలింగ్ మెటీరియల్ ను పోలింగ్ సిబ్బందికి సక్రమంగా అందించేందుకు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధానంగా డిస్ట్రిబ్యూషన్ కౌంటర్ల వద్ద సైనేజ్ బోర్డులను ఎన్నికల సిబ్బంది గుర్తించే విధంగా ఉండాలన్నారు. పోలింగ్ మెటీరియల్ తీసుకున్న పిదప వారిని పోలింగ్ కేంద్రాలకు సురక్షితంగా చేర్చేందుకు రూట్ల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ , రిసెప్షన్ కౌంటర్ల వద్ద ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి అల్పాహారం , మంచినీరు , శుచి శుభ్రమైన భోజనాలు అందించేందుకు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు అందించారు. ఫిబ్రవరి 27 వ తేది ఓటింగ్ అనంతరం పోలింగ్ బూత్ ల నుండి తీసుకువచ్చిన బ్యాలెట్ బాక్సులను నిబంధనల ప్రకారం సురక్షితంగా భద్రపరచేందుకు గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా బ్యాలెట్ కౌంటింగ్ కు సంబంధించి ఏ.సి కాలేజీ లోని ప్రేయర్ హాల్ నందు ఏర్పాటు చేసిన కౌంటింగ్ టేబుళ్లను పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు. బుధవారం డిస్ట్రిబ్యూషన్ కౌంటర్ల వద్ద రద్దీ లేకుండా సజావుగా పోలింగ్ మెటీరియల్ ను పోలింగ్ సిబ్బందికి అందించాలన్నారు. అలాగే పోలింగ్ మెటీరియల్ సరి చూచుకున్న పోలింగ్ సిబ్బందిని సురక్షితంగా రూట్ల ప్రకారం పోలింగ్ స్టేషన్లకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ కె. శ్రీనివాస రావు , గుంటూరు తూర్పు , పశ్చిమ మండల తహశీల్దార్లు నగేష్ , వెంకటేశ్వర్లు, రెవెన్యూ , సర్వే అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News