శాసనమండలి పోలింగ్ రోజున స్పెష‌ల్ క్యాజువ‌ల్ లీవ్‌

-ప‌ట్ట‌భ‌ద్రుల ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్ర‌త్యేక అవ‌కాశం: క‌లెక్ట‌ర్ డీకే బాలాజీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 27న శాస‌న మండ‌లి ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆ రోజు ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు వీలుగా జిల్లాలో ఓటు హ‌క్కు కలిగిన కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు స్పెషల్ క్యాజువల్ లీవ్‌ను భారత ఎన్నికల సంఘం ప్రకటించిన‌ట్లు జిల్లా ఎన్నికల అధికారి, క‌లెక్ట‌ర్ డీకే బాలాజీ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ప్రాథమిక హక్కు అయిన వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రైవేటు, వ్యాపార‌, వాణిజ్య‌, పారిశ్రామిక, బ్యాంకులు, విద్యాసంస్థలలో ఓట‌రుగా న‌మోదు చేసుకున్న ఉద్యోగులు, కార్మికులు వారు ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు యాజమాన్యాలు అనుమ‌తులు ఇవ్వ‌డం, షిఫ్ట్‌ల‌ను సద్దుబాట్లు (అడ్జ‌స్ట్) చేయ‌డం వంటి వెసులుబాటు కల్పించేలా చర్యలు తీసుకోవాలని క‌లెక్ట‌ర్ డీకే బాలాజీ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *