Breaking News

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ పోలింగ్ కు స‌ర్వం సిద్ధం…

-31 లొకేషన్ లో 77 పోలింగ్ కేంద్రాలు…..
-పోలింగ్ విధుల్లో 477 మంది అధికారులు…..
-మూడు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల ద్వారా పోలింగ్ సామాగ్రి పంపిణీ…..
-ఓటు హక్కు వినియోగించుకోనున్న 63,114 మంది పట్టభద్రులు…..
-పోలింగ్ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 4:00 వరకు….
-జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
శాసనమండలి పట్టభద్రుల నియోజక వర్గానికి జిల్లాలో నిర్వహించే పోలింగ్ కు ఏర్పాట్లు పూరి చేసి సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కృష్ణ- గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి జిల్లా ప‌రిధిలో 63,114 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారన్నారు. వీరిలో గుడివాడ డివిజన్లో 18,440 మంది, మచిలీపట్నం డివిజన్లో 23,555, ఉయ్యూరు రెవెన్యూ డివిజన్లో 21,119 మంది ఓటర్లుగా ఉన్నారన్నారు. 77 పోలింగ్ కేంద్రాల్లో 42 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గా గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఓటర్ల స్లిప్పులను పంపిణీ చేశామని, కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు కల్పించామన్నారు. 94 మంది ప్రిసైడింగ్ అధికారులు, 92 మంది ఏపీవోలు, 199 మంది ఓపీవోలు ఉన్నార‌ని, వీరితో పాటు 92 మంది మైక్రో అబ్జర్వ‌ర్లు కూడా ఉంటార‌ని తెలిపారు.

జిల్లా ప‌రిధిలో మొత్తం 63,114 మంది ఓట‌ర్లు ఉన్నార‌ని వారిలో 35,321 మంది పురుషులు, 27,789 మంది మ‌హిళ‌లు,4 గురు థర్డ్ జెండర్స్ ఉన్నారన్నారు. 77పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, వీడియో గ్రాఫర్లను ఏర్పాటు చేశామ‌ని చెప్పారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు 27వ తేదీ సెలవు. పోలింగ్ నిర్వహణ దృష్ట్యా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు 27వ తేదీ గురువారం సెలవు దినంగా ప్రకటించడం జరిగిందన్నారు. ఓటర్లుగా నమోదైన పట్టభద్రులు ఓటు వేసేటప్పుడు అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో 1,2,3 సూచిస్తూ బ్యాలెట్ పేపర్లో నమోదు చేయాలన్నారు.

ఓటరు పోలింగ్ స్టేషన్ కు వచ్చేటప్పుడు సాధారణ ఓటరు కార్డును తప్పనిసరిగా తీసుకురావాలని లేనియెడల ఆధార్ కార్డ్ ,డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్ పోర్టు,

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు లేదా ఇతర ప్రైవేట్ పారిశ్రామిక సంస్థలు ద్వారా ఉద్యోగులకు జారీ చేయబడిన సేవా గుర్తింపు కార్డు,

ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జారీ చేయబడిన అధికారిక గుర్తింపు కార్డులు.

సంబంధిత ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ల నియోజకవర్గానికి చెందిన ఓటర్లు ఉద్యోగంలో ఉన్న విద్యాసంస్థల చేజారీ చేయబడిన సేవా గుర్తింపు కార్డు,

యూనివర్సిటీ జారీ చేసిన డిగ్రీ డిప్లొమా ఒరిజినల్ సర్టిఫికెట్,

కాంపిటెంట్ అథారిటీ జారీ చేసిన ఫిజికల్ హ్యాండీక్యాప్ ఒరిజినల్ సర్టిఫికెట్,

భారత ప్రభుత్వం సామాజిక న్యాయం & సాధికారిక మంత్రిత్వ శాఖ వారిచే జారీ చేయబడిన ప్రత్యేక వైకల్యం ఐడి కార్డ్,
వంటి పది రకాల గుర్తింపు పత్రాలను తీసుకురావచ్చునని కలెక్టర్ డీకే బాలాజీ వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *