Breaking News

డిపిఆర్వో ఐ కాశయ్య సేవలు అభినందనీయం

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త :
కష్టించే తత్వం విది నిర్వహణలో బాధ్యత కలిగిన డిపిఆర్వో ఐ కాశయ్య సేవలు అభినందనీయం అని సమాచార పౌర సంబంధాల శాఖ అదనపు సంచాలకులు ఎల్ స్వర్ణ లత పేర్కొన్నారు. శుక్రవారం పదవి విరమణ చేసిన ఐ. కాశయ్య కనక దుర్గ దంపతులను అదనపు సంచాలకులు విజయవాడ నుండి వొచ్చి అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా గత 37 ఏళ్ళ క్రితం పబ్లిసిటీ అసిస్టెంట్ గా జాయిన్ అయి, అంచలంచెలుగా ఎదిగి సమాచార శాఖ గౌరవించే స్థాయి కి చేరుకోవడం జరిగిందని తెలిపారు. వృత్తి నైపుణ్యం పెంచుకుంటూ, ఆధునిక కాలంలో కంప్యూటర్ ఆవశ్యకత గుర్తించి, గత 20 ఏళ్లుగా నిరంతర అభ్యసిగా పనితీరు చూపడం ద్వారా తనదైన ముద్ర వేసుకున్న కాశయ్య మనందరికీ ఆదర్శ ప్రాయుడు అని పేర్కొన్నారు. కాశయ్య దంపతులను సన్మానించిన వారిలో సూపరింటెండెంట్ క్రిష్ణశ్రీ , జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి సీహెచ్. శ్రీనివాసు, డివిజనల్ పి ఆర్వో ఎమ్ లక్ష్మణా చార్యులు, లైబ్రేరియన్ శేఖర్, , సీనియర్ అసిస్టెంట్ సుబ్రమణ్యం , రామకృష్ణ, ఇతర సిబ్బంది ఉమర్, శేఖర్, సురేష్, వెంకటేశ్వర రావు, వర్మ , ప్రసాద్ , కృష్ణా రావు , జయరాజు, ప్రేమ్ చంద్, భాను ప్రకాష్, జానీ, భవానీ, దుర్గా రావు, తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *