-పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ జి.సతీష్ రెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఏరో స్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన డి.ఆర్.డి.ఓ మాజీ చైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డి కు విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే రాష్ట్రానికి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో డిఫెన్స్, ఏరో స్పేస్ పరిశ్రమలు రావాలని ఎంపి కేశినేని శివనాథ్ ఆకాంక్షించారు. మంగళగిరి ఎ.పి.ఐ.ఐ.సి కార్యాలయంలో గురువారం డాక్టర్ జి.సతీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపి కేశినేని శివనాథ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ డి.ఆర్.డి.ఓ మాజీ చైర్మన్ జి.సతీష్ రెడ్డి అనుభవాన్ని రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఏరో స్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధన్యవాదములు తెలిపారు. గత ఎనిమిది నెలల్లో రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తీసుకురావటం జరిగిందన్నారు. రాష్ట్రానికి డిఫెన్స్ పరిశ్రమలను రాష్ట్రంలో ప్రోత్సహించేందుకే సతీష్ రెడ్డి కి ఈ బాధ్యతలు అప్పగించటం జరిగిందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు విషయంలో డిఫెన్స్, ఏరోస్పెస్ రంగాలకు చెందిన పరిశ్రమలకు మంచి భవిష్యత్తు వుంటుందన్నారు.
అమరావతి లో క్రికెట్ స్టేడియానికి స్పోర్ట్స్ సిటీతో పాటే స్థలం కేటాయింపు జరుగుతుంది. స్థలం కేటాయింపు జరిగిన వెంటనే రెండు సంవత్సరాల్లో క్రికెట్ స్టేడియం పూర్తి చేస్తామని ఎంపి కేశినేని శివనాథ్ ఒక ప్రశ్నకు సమాదానం చెప్పారు.
అంతకు ముందు జి.సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఏరో స్పేస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ హబ్ కి తనని గౌరవ సలహాదారుడిగా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. ఎంపి కేశినేని శివనాథ్ మెంబర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హోమ్, డిఫెన్స్ లో వుంటూ నేషనల్ లెవల్ లో రకరకాల ఇండస్ట్రీయలిస్టులను కలిసి రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.వీరందరి సహకారంతో చాలా తర్వగా పారిశ్రామికంగా అభివృద్ది పర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలు రాష్ట్రాన్ని ముందునిలబెడుతున్నాయి. తనకి ఏరో స్పేస్ డిఫెన్స్ రంగాల్లో వున్న అనుభవంతో రాష్ట్రంలో ఎక్కడెక్కడ డిఫెన్స్ క్లస్టర్స్ ఏర్పాటు చేయాలనే అంశంపై అధికారులతో కలిసి కృషి చేస్తానని తెలిపారు. విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో హైదరాబాద్ వెళ్లే మార్గంలో, అనంతపురం, విశాఖపట్టణం, కర్నూల్, నెల్లూరు,తిరుపతి ప్రాంతాల్లో ఇండస్ట్రీలు అభివృద్ది చెందెందుకు పుష్కలంగా అనేక వనరులు వున్నాయన్నారు. ఈకార్యక్రమంలో ఎపిఐఐసి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News