కలెక్టరేట్‌లో ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు

-లక్ష్య సాధనకు మహర్షి భగీరథుడిని స్ఫూర్తిగా తీసుకోవాలి: జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
లక్ష్య నిర్దేశంతో సాధన దిశగా చేసే ఏ ప్రయత్నంలోనైనా విజయాన్ని సాధించవచ్చని దివి నుండి భువికి గంగ ను తెచ్చిన భగీరథ మహర్షి పట్టుదల అసామాన్యమని స్ఫూర్తిదాయకం అని జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు పేర్కొన్నారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ జయంతి వేడుకల్లో డిఆర్ఓ ముఖ్య అతిథిగా హాజరై మహర్షి భగీరథ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు భగీరథ మహర్షి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ గంగను దివి నుంచి భువికి ఎంతో పట్టుదలతో తెచ్చిన మహనీయుడు భగీరథ మహర్షి అని అందుకే ఆయన అపర భగీరథుడు అని అన్నారు. ఆ మహనీయుడిని స్మరించుకోవడం, జయంతి వేడుకలు జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. మహనీయుల గొప్పతనాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మహనీయుల జీవిత విశేషాలను ప్రజలకు తెలియజేయాలన్న సత్సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం భగీరథ మహా మహర్షి వేడుకలను రాష్ట్ర వేడుకగా నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. లక్ష్య నిర్దేశంతో సాధన దిశగా చేసే ఏ ప్రయత్నంలోనైనా విజయాన్ని సాధించవచ్చని దివి నుండి భువికి గంగ ను తెచ్చిన భగీరథ మహర్షి పట్టుదల అసామాన్యమని స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సహాయ బిసి వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోత్స్న, లక్ష్మీ నారాయణ, కలెక్టరేట్ సిబ్బంది,బి సి సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *