-తిరుపతి నగర పరిధిలోని పలు నీట్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన డిఆర్ఓ
-జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో మే 4న నేడు ఆదివారం నీట్ యూజీ- 2025 పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసాయని జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు పేర్కొన్నారు. నేటి ఆదివారం నిర్వహించిన నీట్ యూజీ- 2025 పరీక్షల నిర్వహణ సరళిని ఎస్ జి ఎస్ ఆర్ట్స్ కాలేజీ, పద్మావతి డిగ్రీ మరియు పీజీ కళాశాల సెంటర్ల ను డిఆర్వో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో మొత్తం 4445 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా అందులో 4333 మంది హాజరయ్యారని 112 మంది గైర్హాజరయ్యారని, వెరసి మొత్తం 97.48 శాతం హాజరయ్యారని డిఆర్ఓ తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లాలో మొత్తం పది ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరిగిందనీ, పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించి కట్టుదిట్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందనీ, పోలీసు సిబ్బంది పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసారని, పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు మౌలిక వసతులైన టాయిలెట్స్, త్రాగునీరు ఉండేలా ఏర్పాటు, పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే విద్యార్థినీ, విద్యార్థులకు ఆర్.టి.సి బస్సులను ఉదయము మరియు సాయంత్రం సమయాలలో అందుబాటులో ఉంచడం జరిగిందనీ, ప్రతి పరీక్ష కేంద్రంలో వైద్య సిబ్బంది తో క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్ష కేంద్రాల వద్ద జనం గుమి కూడకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. పరీక్ష జరుగు కేంద్ర సమీపంలో ఎక్కడ కూడా జిరాక్స్ కేంద్రాలు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగిందనీ తెలిపారు.
తిరుపతి జిల్లాలోని పది పరీక్ష కేంద్రాలు :
1. శ్రీ పద్మావతి గర్ల్స్ హై స్కూల్, వెస్ట్ చర్చి రోడ్, బాలాజీ కాలనీ, తిరుపతి. 2. పీఎం కేంద్రీయ విద్యాలయ నెంబర్ 1, తిరుపతి, హరే కృష్ణ రోడ్, యం సి ఆర్ కాలనీ, తిరుపతి
3. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (ఉమెన్స్ యూనివర్సిటీ) శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం,
ఎగ్జామినేషన్ హాల్, పద్మావతి నగర్, తిరుపతి
4. ఎస్.జి.ఎస్ ఆర్ట్స్ కాలేజ్ (ఆటానమస్) నియర్ లక్ష్మీపురం సర్కిల్ తిరుచానూర్ రోడ్, తిరుపతి
5. శ్రీ పద్మావతి ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ (టీటీడీ) వింగ్ -ఏ, ఎస్ వి యూనివర్సిటీ నియర్ శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్ తిరుపతి
6. శ్రీ పద్మావతి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ కాలేజ్ (టిటిడి) వింగ్ – బి, ఎస్ వి యూనివర్సిటీ పద్మావతి గెస్ట్ హౌస్ తిరుపతి
7. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ క్యాంపస్ హై స్కూల్, వెస్ట్ చర్చి రోడ్డు, బాలాజీ కాలనీ తిరుపతి
8. శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్ (టిటిడి) నియర్ సంస్కృత విద్యాపీఠం, ఎల్ఐసి రోడ్, బాలాజీ కాలనీ తిరుపతి
9. ఎస్ వి ఆర్ట్స్ కాలేజ్ (టిటిడి) వింగ్ ఏ, ఎస్ వి ఆర్ట్స్ కాలేజ్ (టీటీడీ) వింగ్ – ఏ, బాలాజీ కాలనీ తిరుపతి
10. డి ఆర్ డబ్ల్యు జూనియర్ కాలేజ్, గూడూర్, జడ్పీ హైస్కూల్ రోడ్, గూడూరు.
Prajavartha Online Telugu News