అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డిటి) సంస్థకు ఎఫ్సీఆర్ఎ క్రింద వివిధ దేశాల నుండి అందే సహాయానికి సంబంధించి రెన్యూవల్ పునరుద్ధరణ చేసేందుడు తగు చర్యలు చేపట్టవలసిందిగా న కోరుతూ శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల తరపున సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, ఎస్ కె యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు కృష్ణయ్య తదితరులు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి ఈ దిగువ వినతిపత్రం అందజేశారు.
1969లో విన్సెంట్ షెర్రర్, అన్నే షెర్రర్ దంపతులచే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డిటి) ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో స్థాపించబడింది. గ్రామీణ ప్రాంతాల్లోని పేదరికం, వాధలు, అన్యాయాలను నిర్మూలించడానికి, నమాన అవకాశాలు, సంపదను అందరికీ అందించడానికి ఈ సంస్థను ప్రారంభించారు. సంస్థను ఏర్పాటు చేసిన తర్వాత కరువు పీడిత ప్రాంతాల్లో ఫుడ్-ఫర్-వర్క్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తద్వారా వేలాదిగా బావులు తవ్వటం, లక్షలాది గృహాల నిర్మాణం, కుష్టు వ్యాధి కేంద్రం స్థాపన వంటి పనులు చేపట్టింది. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభించి కూలీలను రైతులుగా మార్చడంలో సహాయపడింది. గ్రామీణ సమాజాల్లో పేదరికం, బాధలు, అన్యాయాలను తొలగించి, స్థిరమైన అభివృద్ధి ద్వారా నమాజాన్ని సాధికారపరచడం, మహిళలు, పిల్లలు, వైకల్యం ఉన్న వ్యక్తులు, గిరిజన వర్గాల అభివృద్ధికోసం ఆరిటి సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. విద్య, వైద్యం, గృహనిర్మాణం, స్థిరమైన జీవనోపాధి, సాంస్కతిక క్రీడా కార్యక్రమాల ద్వారా పేదల అభ్యున్నతికి తీవ్రంగా కృషి చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యా సౌకర్యాలను మెరుగుపరచడానికి మొబైల్ లైబ్రరీలు, ట్యూషన్ న్యూళ్లు ఏర్పాటు చేయడమే కాకుండా స్కాలర్షిప్లను అందిస్తోంది. బత్తలపల్లి, కల్యాణదుర్గం, కనేకల్లలో రెండు సెకండరీ అనుపత్రులు, ఒక ప్రైమరీ హెల్త్కేర్ సెంటర్ స్థాపించింది. రోజువారీ 3,000 మంది పేదవారు ఈ ఆనుపత్రుల సేవలను వినియోగిస్తున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఆదాయ ఉత్పత్తి కార్యక్రమాలు, వృత్తి శిక్షణలు, మహిళల భద్రత సమానత్వం కోసం కార్యక్రమాలు నిర్వహించింది. వైర్యల్యంతో బాధపడుతున్న వారి కోసం కమ్యూనిటీ డేస్ట్ రిహాబిలిటేషన్ సెక్టర్ స్థాపించి, కృత్రిమ అవయవాలు, పునరావాస కేంద్రాలు, ఉపాధి అవకాశాలు అందిస్తున్నది. ఎకాలజీ సెక్టర్ ద్వారా నీటి, నేల పరిరక్షణ, అటవీకరణ, హార్టికల్చర్ ప్రవేశపెట్టింది. వేలాది మంది రైతులకు మైక్రో ఇరిగేషన్ వ్యవస్థలు అందించి, నీటి అదా, ఉ త్పత్తి పెంపు సాధించింది. సౌర ఫలజాల సహాయంతో స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణం, రోడ్లు తాగునీటి సౌకర్యాలు కల్పిస్తున్నది. 2013లో ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ నుండి గృహ నిర్మాణంలో అత్యుత్తమ సేవలకు గుర్తింపు లభించింది. ఫెర్రర్ మరణానంతరం ఆయన కుమారుడు మంటో ఫెర్రర్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలలో మన్ననలు పొందారు.
రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఒక ఉద్యమంలా సాగింది. 1960లలో అనంతపురంలోని కరువుతో కాలిపోయిన భూములలో రూపుదిద్దుకున్న నిశ్శబ్ద విప్లవం వేలాది గ్రామాల అభివృద్ధికి తార్కాణమయ్యింది.
భారత ప్రభుత్వం ఇటీవల ఆర్టిటి యొక్క విదేశీ నహకారం నియంత్రణ చట్టం (ఎఫ్సిఆర్ఎ) లైసెన్ను పునరుద్ధరించకుండా నిలుపుదల చేసింది. ఎఫ్సిఆర్ఎ నమస్యను అత్యవసరంగా పరిష్కరించకపోతే, దశాబ్దాలుగా కొనసాగుతున్న సేవలకు ఆటంకం ఏర్పడే ప్రమాదముంది. కాఠిన మానవతా మరియు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా fcra పునరుద్ధరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని కోరవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
Prajavartha Online Telugu News