ఇంకుడు గుంత‌ల‌తో భూగ‌ర్భ జ‌లాల వృద్ధి: కమిషనర్ కేతన్ గార్గ్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వర్షపు నీటి సంర‌క్ష‌ణ‌తో భూగ‌ర్భ జ‌లాలు పెరుగుతాయ‌ని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న ఇంకుడు గుంతలను అధికారులతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. మారుతున్న వాతావరణ పరిస్ధితుల దృష్ట్యా నీటి ప్రాధాన్యతను ప్రతిఒక్కరు గుర్తించాలన్నారు. ఆహార భ‌ద్ర‌త‌కు భ‌రోసా క‌ల్పించ‌డంలో భూగ‌ర్భ జ‌లాల‌ది కీల‌క‌పాత్ర అని పేర్కొన్నారు. కనుక వ‌ర్ష‌పు నీటి సంర‌క్ష‌ణ‌పై ప్ర‌తిఒక్కరూ అవ‌గాహ‌న పెంపొందించుకోవాల్సిన అవ‌స‌రం ఉందన్నారు. ఎక్కడైతే వ‌ర్ష‌పు నీరు నిల్వ ఉండే అవ‌కాశ‌ముందో ఆయా ప్రాంతాల‌ను ముందుగానే గుర్తించి.. స‌మీపంలో ఇంకుడు గుంత‌లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాజమహేంద్రవరం నగరంతో పాటు చుట్టూ ఉన్న మరో 10 పంచాయతీలు కలుపుకుని మొత్తం 6,560 ఇంకుడు గుంతలను ఇప్పటికే నిర్మించుకున్నట్లు కమిషనర్ చెప్పారు. కనుక జ‌లం ప‌రంగా భ‌విష్య‌త్తులో ఎటువంటి ముప్పు రాకుండా ఉండాలంటే ప్ర‌తిఒక్క‌రూ సామాజిక బాధ్య‌త‌గా వాన‌నీటి సంర‌క్ష‌ణ‌లో భాగ‌స్వాములు కావాల‌ని పిలుపునిచ్చారు. తద్వారా భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించినవారవుతామని తెలియజేశారు. కార్యక్రమంలో మేనేజర్ ఎండి అబ్దుల్ మాలిక్, సూపరిటెండింగ్ ఇంజనీర్ ఎం.సీహెచ్.కోటేశ్వరరావు, ఈఈ మాధవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *