Breaking News

వార్షిక హనుమాన్ జయంతి మహోత్సవాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కొత్తూరు తాడేపల్లి గ్రామంలోని శ్రీ పంచముఖ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో వార్షిక హనుమాన్ జయంతి మహోత్సవాలు బుధవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, దీక్షాధారణ, మంట పారాధన, కలశ స్థాపన అనంతరం శ్రీ పంచముఖ వీరాంజనేయ స్వామి వారికి నాగవల్లి దళార్చన, సిందూరార్చన నిర్వహించారు. శ్రీ లక్ష్మీ గణపతి, సుబ్రహ్మణ్య, దత్తాత్రేయ హోమాలు అనంతరం శ్రీ అనఘా వ్రతం నిర్వహించి, సాయంత్రం శ్రీ లక్ష్మీ గణపతి కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ నిర్వాహకులు శ్రీ కప్పగంతు లక్ష్మీనారాయణ దంపతులు వైభవంగా నిర్వహించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్‌ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌

-క్షేత్రస్థాయి ఆర్‌ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *