తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి పార్లమెంటు పరిధీలోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ను సర్వాంగ సుందరంగా, అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్దారు. రైల్వే సేవలను, మౌలిక వసతులను ఆధునీకరించడం లో బాగంగా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ ని కూడా అమృత్ స్టేషన్ గా ఎంపిక చేశారు. దేశ వ్యాప్తంగా అమృత్ స్టేషన్ లని జాతికి అంకితమివ్వడంలో బాగంగా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ని కూడా మే 22వ తేదీన ప్రధానమంత్రి మోడీ గారు జాతికి అంకితమివ్వనున్నారు. ఈ సందర్బంగా తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాలతో సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ అబివృద్ది, మౌలిక వసతుల కోసం పలుమార్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ని కలిశానని గుర్తు చేశారు. సూళ్లూరుపేట అమృత్ స్టేషన్ కూడా జాతికి అంకితమివ్వనున్న నేపద్యంలో తనను ఆహ్వానించారని తెలిపారు. సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజల తరపున ప్రధానమంత్రి మోడి కి, కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ్ కి కృతజ్ఞతలు తెలిపారు.
Prajavartha Online Telugu News