Breaking News

కోటి మంది సభ్యత్వాలు ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం

-ఎన్ని ఇబ్బందులొచ్చినా కార్యకర్తలను కాపాడుకుంటాం
-జిల్లాలో టీడీపీ కుటుంబాల‌ను త‌రిమికొట్టారు
-పల్నాడులో తోట చంద్రయ్యను అతి దారుణంగా చంపారు
-చంద్రయ్య కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగంతో అండగా నిలుస్తున్నాం
-సంక్షేమం, అభివృద్ధి టీడీపీకి రెండు కళ్లు
-ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్

న‌ర‌స‌రావుపేట, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీకి కార్య‌క‌ర్త‌లే బ‌ల‌మ‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. ప‌ల్నాడు జిల్లా న‌ర‌స‌రావు పేట‌లో బుధ‌వారం జ‌రిగిన జిల్లా మినీ మ‌హానాడు కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా మంత్రి గొట్టిపాటి పాల్గొన్నారు. కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి భావోద్వేగంగా మాట్లాడారు. టీడీపీ త‌న 43 సంవ‌త్స‌రాల రాజ‌కీయ ప్ర‌స్థానంలో ఎన్నో ఒడుదుడుకుల‌ను ఎదుర్కొని నిల‌బ‌డింద‌ని గుర్తు చేశారు. తోట చంద్ర‌య్య‌ను వైసీపీ రౌడీ మూక‌లు దారుణంగా చంపార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పార్టీ కోసం ప్రాణాల‌ర్పించిన చంద్ర‌య్య కుటుంబాన్ని ప్ర‌భుత్వ ఉద్యోగంతో ఆదుకున్నామ‌ని మంత్రి తెలిపారు. ప‌ల్నాడు ప్రాంతంలోని వేలాది టీడీపీ కుటుంబాల‌ను నాటి వైసీపీ రౌడీలు గ్రామాల నుంచి త‌రిమి కొట్టార‌ని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ప‌ల్నాడులోని వైసీపీ బాధిత కుటుంబాల‌ను మ‌ర‌లా స్వ‌గ్రామాల‌కు తీసుకొచ్చి, వారికి ఆర్థిక స‌హాయం చేశామ‌ని వివ‌రించారు. కార్య‌క‌ర్త‌ల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ఎల్ల‌ప్పుడూ వెన్నుద‌న్నుగా ఉంటుంద‌ని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

అభివృద్ధి, సంక్షేమం రెండు క‌ళ్లుగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పాల‌న సాగుతుంద‌ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. 1983లో పార్టీ పెట్టిన త‌రువాత కేవ‌లం 9 నెల‌ల కాలంలోనే అధికారం చేప‌ట్టి, రికార్డు సృష్టించిన ఘనత తెలుగుదేశం పార్టీకి చెందుతుందని చెప్పారు. అదే విధంగా చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో 2024లో కూట‌మి ప్ర‌భుత్వం అంతే మెజారిటీతో అధికారం చేప‌ట్టింద‌న్నారు. రెండు రూపాయిల‌కు కిలో బియ్యం, మ‌హిళ‌ల‌కు స‌మాన ఆస్తి హ‌క్కు వంటి ఎన్నో విప్ల‌వాత్మ‌క చ‌ట్టాలు తీసుకొచ్చిన ఘ‌న‌త తెలుగుదేశం వ్య‌వ‌స్థాప‌కులు, స్వ‌ర్గీయ ఎన్టీఆర్ దే అన్నారు. కోటి మంది స‌భ్య‌త్వం క‌లిగిన ఏకైక ప్రాంతీయ పార్టీ కూడా తెలుగుదేశమే అన్నారు.

కార్య‌క‌ర్త‌ల సంక్షేమమే ల‌క్ష్యంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అనేక పథకాలను చేప‌డుతున్నార‌ని మంత్రి గొట్టిపాటి వివ‌రించారు. గోదావ‌రి జ‌లాల‌ను ప‌ట్టిసీమ ద్వారా కృష్ణా జిల్లా తీసుకొచ్చిన ఘ‌నత చంద్ర‌బాబుదే అన్నారు. అదే విధంగా కార్య‌క‌ర్త‌ల కుటుంబాల గురించి కూడా వ్య‌క్తిగ‌తంగా ఆలోచించి రూ.5 ల‌క్ష‌ల ప్ర‌మాద బీమా క‌ల్పిస్తున్నార‌ని తెలిపారు. మ‌హానాడు అంటేనే కార్య‌క‌ర్త‌ల పండుగ అని చెప్పిన మంత్రి గొట్టిపాటి, తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో ఉన్న స‌మ‌యాల్లో, వైసీపీ నేత‌ల ఘాత‌కాల‌కు ఎదురొడ్డి, ఎన్ని ఇబ్బందులొచ్చినా నిల‌బ‌డి, పార్టీని అధికారంలోకి తీసుకు వ‌చ్చార‌ని కార్య‌క‌ర్త‌ల‌ను మంత్రి గొట్టిపాటి ప్రశంసించారు. కార్య‌క్ర‌మంలో న‌ర‌స‌రావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవ‌రాయ‌లు, ప్ర‌భుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజ‌నేయులు తో పాటు అధిక సంఖ్య‌లో కార్య‌కర్త‌లు, పార్టీ నేత‌లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *