Breaking News

వ్యర్ధాలను రోడ్ల పై వేయకుండా డస్ట్ బిన్నులను ఉపయోగించుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో హోల్ సేల్ మార్కెట్లలో ఆశీలు వసూళ్ళకు టెండర్ పొందిన వాళ్ళు నిర్దేశిత ప్రాంతంలోనే ఆసీల్లు వసూళ్లు చేయడంతో పాటు ఆయా ప్రాంతాలలో వ్యర్ధాలను కూడా వారే తొలగించాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. శనివారం నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ గారితో కలిసి బండ్ల బజార్ (హోల్ సేల్ ఫ్రూట్ మార్కెట్), లాలాపేట, పట్నంబజార్, ఆదర్శ్ నగర్ తదితర ప్రాంతాల్లో పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా పై అందిన పిర్యాదులను నేరుగా పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా మేయర్  మాట్లాడుతూ, క్లీన్ & గ్రీన్ గుంటూరు కోసం నగర పాలక సంస్థ అన్ని విభాగాలు ప్రత్యేక దృష్టితో కృషి చేస్తున్నామని, నగర ప్రజలు మరియు వ్యాపార సంస్థలు కూడా సహకరించాలని కోరారు. నగర నడిబోడ్డులోని పట్నం బజారులో ప్రతి రోజు క్వింటాల కొద్దీ వ్యర్ధాలు వస్తున్నాయని, వాటిని సరైన పద్దతిలో తొలగించకపోవడం వలన స్థానికంగా తీవ్ర సమస్యలు తలేత్తుతున్నాయన్నారు. హోల్ సేల్ మార్కెట్ లో అసీలు వసూళ్ళకు టెండర్ పొందినవారు నిర్దేశిత ప్రాంతంలో నూరు శాతం వ్యర్ధాలను తోలగించాల్సిందేనన్నారు. అలాగే నగరంలో పారిశుధ్యం, త్రాగు నీటి సరఫరా పై అందే పిర్యాదులను పరిష్కరించేందుకు అధికారులు సదా సిద్దంగా ఉండాలన్నారు. రోడ్లు, డ్రైన్ల ఆక్రమణల తొలగింపుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో పారిశుధ్య మెరుగుదలకు గత కొంతకాలంగా అధిక ప్రాధాన్యతతో కృషి చేస్తున్నామని, అదనపు కార్మికులు, వాహనాలు, పుష్ కార్త్స్, సామగ్రిని అందించామన్నారు. శానిటరీ వార్డుల వారీగా ఉదయం సాయంత్రం పారిశుధ్య పనుల పర్యవేక్షణకు నోడల్ అధికారులను నియమించామన్నారు. లాలాపేట పట్నం బజారు, బండ్ల బజారు ప్రాంతాలలో హోల్ సేల్ వ్యాపారస్తుల నుండి అసీలు వసూలు చేసే టెండర్ దారు ఆయాప్రాంతాల పరిశుభ్రత బాధ్యత తీసుకోవాలన్నారు. ఇతర ప్రాంతాలలో జియంసి పారిశుధ్య విభాగం శుభ్రం చేయడానికి ప్రత్యేక ద్రుష్టి సారించాలని ఆదేశించారు. వ్యాపారస్తులు కూడా వ్యర్ధాలను రోడ్ల పై వేయకుండా డస్ట్ బిన్నులను ఉపయోగించుకోవాలని సూచించారు. ఆదర్శ నగర్ లో త్రాగు నీటి సరఫరా పై అందిన పిర్యాదు ప్రాంతాన్ని పరిశీలించి, సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఇంజీరింగ్ అధికారులను ఆదేశించారు.
సదరు పర్యటనలో మహమ్మద్ చిష్టి, ఈరంటి వరప్రసాద్, సి.యం.ఓ.హెచ్ డాక్టర్ అమృతం, సిటీ ప్లానర్ రాంబాబు, యస్.ఈ నాగమల్లెస్వర రావు, రెవిన్యూ, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *