Breaking News

ఆంధ్ర ప్రదేశ్ ఆర్ పి ఐ అధ్యక్షులుగా డాక్టర్ ఉప్పులేటి దేవిశ్రీప్రసాద్ ఎన్నిక

-రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాని బలోపేతం చేస్తాం…
-ఆర్ పి ఐ జాతీయ అధ్యక్షులు యశ్వంత్ భీమ్ రావ్ అంబేద్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పార్టీలన్నీ ధనికుల కోసం పనిచేస్తున్నాయని తమ పార్టీ మాత్రం ఎస్సి ఎస్టి బీసీ మైనార్టీల సంక్షేమం కోసం పనిచేస్తుందని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు యశ్వంత్ రావ్ భీమ్ రావ్ అంబేద్కర్ అన్నారు.. ఈ పార్టీ నాయకుల కోసం పనిచేయదని ప్రజల సంక్షేమమే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. సొంత సిద్ధాంతాలతో పనిచేస్తూ రాష్ట్రంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను మరింత బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు..
భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్ పి ఐ) ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునిగా ఉప్పులేటి దేవి శ్రీ ప్రసాద్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.. ఈ సందర్భంగా గాంధీ నగర్ లోని ఐలాపురం హోటల్ నందు జరిగిన కార్యక్రమం లో ఆర్ పి ఐ పార్టీ జాతీయ అధ్యక్షులు భీమ్ రావు అంబేద్కర్ మనవడు యశ్వంత్ అంబేద్కర్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని ఆయన అందుకున్నారు.. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యశ్వంత్ అంబేద్కర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఆర్బిఐ పార్టీ బలంగా ఉందన్నారు.. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న దేవి శ్రీ ప్రసాద్ ని ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులుగా నియమించడం జరిగిందని అందరూ తమ పార్టీకి అండగా నిలవాలన్నారు.. రాష్ట్రంలో అన్ని పార్టీలు ధనికులకు అండగా ఉంటున్నాయని తమ పార్టీ మాత్రం బడుగు బలహీన వర్గాలు దళితుల సంక్షేమ కోసం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.. గత ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు పేరుతో దళితులకు రావలసిన నిధులను మళ్లించి అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.. తమ పార్టీ సొంత సిద్ధాంతాలతో పనిచేస్తూ రాష్ట్రంలో ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు..

అనంతరం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఉప్పులేటి దేవి ప్రసాద్ మాట్లాడుతూ తనపై ఉంచిన బాధ్యతకు పూర్తి న్యాయం చేస్తానని రాజ్యాంగబద్ధంగా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు.. సామాజిక రాజకీయ మార్పు తీసుకురావడానికి తమ వంతు కృషి చేస్తానన్నారు.. అంబేద్కర్ ఆశించిన విధంగా నవ సమాజ స్థాపనకు అతని మనవడు యశ్వంత్ అంబేద్కర్ కృషి చేస్తున్నారని సమాజంలో మార్పు తీసుకొచ్చే విధంగా తమ పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయన్నారు.. రాష్ట్రంలో ఇప్పటికే అనేక దౌర్జన్యాలు, మానభంగాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలోనే దళితులను సంఘ బహిష్కరణ చేశారని గుర్తు చేశారు.. ఇప్పటికీ అనేక చోట్ల దళితులు గిరిజనులపై దాడులు జరుగుతున్నాయి అన్నారు.. పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్యని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందన్నారు.. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అనేది రాజకీయ ప్రయోజనల కోసం చేసేదనీ,, దళితుల మధ్య విభేదాలు తీసుకువస్తే ఆధిపత్యం చేలాయించొచ్చు అనే ధోరణితో అగ్రకులాలు ఉన్నాయన్నారు.. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ప్రజలకు అందకుండా ప్రభుత్వాలు పాలన చేస్తున్నాయని విమర్శించారు.. సామాజిక విప్లవం రాకపోతే ప్రజల జీవితాలలో ఎప్పటికీ మార్పు రాదన్నారు.. అంబేద్కర్ మనవడు నడిపే ఈ పార్టీలో పనిచేస్తేనే దళితులకు న్యాయం చేయగలం అని ఆయన చెప్పారు.. రాబోయే అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన పేర్కొన్నారు.. రాజ్యాంగాన్ని కాపాడుకొని మనువాదులను పారద్రోలుదామని ఆయన పిలుపునిచ్చారు.. కార్యక్రమంలో భాగంగా యశ్వంత్ అంబేద్కర్, ఉప్పులేటి దేవిశ్రీప్రసాద్ లను గజమాలతో సత్కరించారు.. ఈ కార్యక్రమంలో ఆర్.బి.ఐ తెలుగు రాష్ట్రాల ఇన్చార్జి మేజర్ చంద్రకాంత్, బొనిగల ప్రదీప్, బండ్లమూడి స్టాలిన్, నల్లపు నీలాంబరం, పిల్లి రాజు, భూషణం తదితరులు పాల్గొన్నారు..

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తీవ్ర వాయుగుండం నేపథ్యంలో ఆర్‌ & బీ శాఖ అధికారులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌

-క్షేత్రస్థాయి ఆర్‌ & బీ శాఖ అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి -సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *