Breaking News

చెన్నై చేరుకున్న పవన్ కళ్యాణ్ 

చెన్నై, నేటి పత్రిక ప్రజావార్త :
‘వన్ నేషన్… వన్ ఎలక్షన్’పై సోమవారం ఉదయం నిర్వహించే సెమినార్ లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు జనసేన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెన్నై చేరుకున్నారు. ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి చెన్నై చేరుకున్నారు. చెన్నై విమానాశ్రయంలో ఆయనకు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సాదరంగా స్వాగతం పలికారు. తమిళనాడుకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులు, పర్యావరణ ఉద్యమకారులు కె.ఎస్. రాధాకృష్ణన్, ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు ఎం. చక్రవర్తి, అర్జున మూర్తి, అమర్ ప్రసాద్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్  రాక సమాచారం తెలుసుకుని భారీ సంఖ్యలో జనసేన శ్రేణులు విమానాశ్రయానికి చేరుకుని, పార్టీ జెండాలు ప్రదర్శిస్తూ జేజేలతో స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్  బస చేసిన హోటల్ దగ్గర బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్, పలువురు బీజేపీ నేతలు స్వాగతం పలికారు. ఈ రోజు ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొని అక్కడి నుంచి నేరుగా చెన్నైకి చేరుకున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *