– డివిజనల్ పరిపాలన అధికారిణి యం. సుజాత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి అర్జీదారునికి పూర్తి స్థాయి న్యాయం చెయ్యాలని సబ్ కలెక్టర్ కార్యాలయ డివిజనల్ పరిపాలన అధికారిణి యం. సుజాత డివిజన్ స్థాయి అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన “పి జి ఆర్ ఎస్ – మీ కోసం” వేదిక లో వచ్చిన అర్జీలను ఆర్డీఓ తరపున డివిజన్ స్థాయి అధికారులతో కలసి డివిజనల్ పరిపాలన అధికారిణి యం. సుజాత స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “పి జి ఆర్ ఎస్ – మీ కోసం” ద్వారా ప్రజల నుంచి 4 అర్జీలను స్వీకరించడం జరిగిందన్నారు. ప్రతి అర్జీని నిర్నీత కాల వ్యవధిలో పరిష్కరించి దరఖాస్తుదానికి న్యాయం చేయాలని అధికారులకు సూచించారు.
ఈరోజు అర్జీలు.
రాజమహేంద్రవరం రూరల్ పాలమూరు గ్రామానికి చెందిన కె రమేష్ అనే వ్యక్తి తనకు నీటి కొళాయి సమస్య ఉన్నందున నీటి కొళాయి కనెక్షన్ ఇప్పించవలసిందిగా కోరుతూ దరఖాస్తు చేసుకుని ఉన్నారు.
కోరుకొండ మండలం మునుగోలు గ్రామానికి చెందిన వై వరలక్ష్మి అనే మహిళ తనకు గల భూమిని రి సర్వే చేయించి తగు న్యాయం చేయవలసిందిగా కోరుతూ దరఖాస్తు నందు పేర్కొన్నారు.
ఆనంద్ నగర్ కు చెందిన ఏ అనిల్ అనే వ్యక్తి తనకు ఎటువంటి జీవనాధారం లేనందున రేషన్ కార్డు ఇప్పించవలసిందిగా కోరుతూ దరఖాస్తు చేసుకుని ఉన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News