స్వర్ణాంధ్ర విజన్ -2047 కార్యాచరణ ప్రణాళిక అమలుకు అడుగులు మంత్రి నిమ్మల, మంత్రి దుర్గేష్

-సీఎం చంద్రబాబునాయుడుతో వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
-సీఎం సూచనల మేరకు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నియోజకవర్గ, మండల విజన్ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేస్తామని స్పష్టం
-ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా ప్రణాళికలు రూపొందిస్తామని మంత్రుల హామీ
-సీఎం ప్రత్యేక చొరవ, ఆదరణ వల్ల పర్యాటక రంగం అభివృద్ధి చెందే అవకాశం ఉందన్న మంత్రి దుర్గేష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వం, దిశా నిర్దేశం లో శాసన సభ్యులకు ప్రతి నియోజక వర్గ స్థాయిలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, తగిన మానవ వనరులు అందుబాటులోకి తీసుకుని రావడం, అందులో మమ్మల్ని భాగస్వామ్యం చేయడం అభినందనీయం , స్పూర్తి దాయకం అని జిల్లా ఇంచార్జీ , జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామా నాయుడు, జిల్లా మంత్రి , రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ లు పేర్కొన్నారు

సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి నిర్వహించిన డివి ఏపీ కార్యక్రమాన్ని లాంఛనంగా 175 నియోజక వర్గాల పరిధిలో ప్రారంభించి అనంతరం స్థానిక ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు, మేధావి వర్గం తో సీఎం ముఖా ముఖి సంబంధించి, వారి ఆలోచనలు పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, నన్నయ్య యూనివర్సిటీ వీసీ డా ఎస్ ప్రసన్న శ్రీ, తదీతరులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రూరల్ సివిఏపి కార్యాలయం నుంచి పాల్గొని, ముఖ్యమంత్రి ఆలోచనలు, యువతకు ప్రోత్సాహం, నైపుణ్య పెంపు వ్యవస్థ పై కృతజ్ఞతలను తెలిపారు..పి.4 ద్వారా నలుగురు పేద కుటుంబాలు చెందిన విద్యార్థుల చదువులు చెప్పించే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక కలెక్టరేట్ నుంచి స్వర్ణాంధ్ర విజన్ -2047 లక్ష్యాల సాధనలో భాగంగా ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా తూర్పుగోదావరి జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నియోజకవర్గ, మండల విజన్ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేస్తామని జిల్లా ఇంచార్జీ మంత్రి నిమ్మల రామా నాయుడు, మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.

స్వర్ణాంధ్ర విజన్ -2047 కార్యాచరణ ప్రణాళికపై సీఎం చంద్రబాబునాయుడుతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి కందుల దుర్గేష్ పలు అంశాలను వివరించారు. తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధికి సంబంధించిన ప్రాధాన్యత అంశాలను ప్రాతిపదికగా తీసుకొని క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తామని సీఎంకు తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడుతో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా క్షేత్రస్థాయి నుండి కార్యాచరణ ప్రణాళికలు ఏర్పాటు చేస్తామన్నారు. నియోజకవర్గ, మండల స్థాయిలో అభివృద్ధి ప్రణాళికలు చేయాలన్న సీఎం సూచనలకు ధన్యవాదాలు తెలిపారు. ఇది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమమని మంత్రి అభివర్ణించారు. తూర్పుగోదావరి జిల్లాలో పరిశ్రమలు, వ్యవసాయం, ఉద్యాన, ఆక్వా రంగాలు ప్రధానమైనవని, ప్రత్యేకించి నిడదవోలు నియోజకవర్గం పూర్తి వ్యవసాయాధారిత ప్రాంతమని సీఎం కు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో గుర్తించి తదనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. తమ దృష్టికి రాగానే సంబంధిత సమస్యలు పరిష్కరించి జిల్లా అభివృద్ధికి దోహదపడాలని సీఎం చంద్రబాబునాయుడును మంత్రి దుర్గేష్ కోరారు.

యువత,, ఔత్సాహిక పారిశ్రామకి వేత్తలు విద్యార్థుల ద్వారా ప్రతిపాదించే నూతన ఆవిష్కరణలకు ఆర్థిక, సాంకేతిక చేయూతనిచ్చే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ జిల్లాలో ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. ఇది ఏపీ యువతకు వరం అని మంత్రి దుర్గేష్ తెలిపారు. అదేవిధంగా రాజానగరంలో 300 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థలం అందుబాటులో ఉందన్నారు. సీఎం ప్రత్యేక చొరవ, ఆదరణ వల్ల రాష్ట్రంలో, జిల్లాల్లో పర్యాటక రంగం అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలో టూరిజం సర్క్యూట్ లు ఏర్పాటు చేసేందుకు అవకాశముందన్నారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పునరుద్ధరణ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మంత్రి దుర్గేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ జిల్లాలో ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రకమైన సమస్య ఉంటుందని అన్నారు. వాటన్నింటిని వెలికి తీయాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో వనరులను సద్వినియోగం చేసుకోవాలని ఆదేశించారు. సమస్యలు పరిష్కరిస్తూనే అవకాశాలను అనువుగా మలుచుకోవాలని సూచించారు. గ్రామస్థాయి నుండే ఇన్నోవేటివ్ గా ఆలోచించి సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుడదామని తెలిపారు. తమ ఆదేశాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ప్రణాళిక రూపొందించుకొని సమర్పిస్తామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.

జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ప్రాంతీయ స్థాయిలో స్వర్ణఆంధ్ర లక్ష్యాల (నీటి భద్రత, పేదరికం తగ్గింపు, నైపుణ్యాభివృద్ధి వంటివి) అమలును పర్యవేక్షించడానికి ప్రతి జిల్లాలో జిల్లా విజనరీ కార్యాచరణ ప్రణాళిక (DVAP) యూనిట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా స్థాయిలో, ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల స్థాయిలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని ఈ రోజు నుంచి కార్యకలపాలను ప్రారంభించినట్లు తెలిపారు..DVAP కోసం సిబ్బందిలో గ్రామ/వార్డు సచివాలయాల నుండి నియామకాలు – VROలు, ప్రణాళిక కార్యదర్శులు, సర్వే సహాయకులు నియమించినట్లు తెలిపారు.

జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామా నాయుడు, జిల్లా మంత్రి, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ , జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎస్. ప్రసన్న శ్రీ, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *